సాధారణంగా ప్రతి వంటింట్లో లభించే మసాలాలలో అల్లం కూడా ఒకటి . అల్లం మన ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుంది అంటే ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా సరే ఇట్టే దూరం చేసుకోవచ్చు.  ప్రస్తుతం కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సమయంలోనే అల్లం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి చెందకుండా సహాయపడే ఈ అల్లం బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా దోహదపడుతుంది.  అలాగే నోటి ఆరోగ్యం కాపాడడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది.

మన ఆరోగ్యాన్ని పెంపొందించే అల్లం గర్భిణీ స్త్రీలు తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న అసౌకర్యం దూరం అవుతుంది. అలాగే ప్రేగులలో నిలిచిపోయిన గ్యాస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. వాంతులు,  వికారం కలిగినప్పుడు అల్లం ముక్క నోట్లో వేసుకొని ఆ రసం మింగుతూ ఉండడం వల్ల సమస్య తగ్గుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఎటువంటి సమస్యలనైనా దూరం చేసుకోవచ్చు.  జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఉదయాన్నే అల్లం టీలో వేసుకొని త్రాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను పొందవచ్చు.

అల్లంని ప్రతిరోజు తీసుకోవడం వలన మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ను తగ్గించి బరువు తగ్గడంలో సహాయపడుతోంది. అలానే అల్లం మన ఆకలిని తగ్గించి క్యాలరీల సంఖ్యను తగ్గించడంలో  ఉపయోగపడుతుంది. మధుమేహం ఉన్నవారు అల్లంని ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాలి. అల్లం రక్తం లోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు. డయాబెటిస్ రోగుల్లో ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపడేందుకు అల్లం ఉపయోగపడుతుంది.

అజీర్ణ సమస్యలకు అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. కడుపు ఖాళీ కావడానికి అల్లం బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అజీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్న వారికి అల్లం చాలా మంచిది. కడుపులో నొప్పి ఉన్నవారికి,వికారంతో బాధపడుతున్న వారికి అల్లం చాలా బాగా పనిచేస్తుంది. అల్లంతో ఇన్ని ప్రయోజనాలు లభిస్తాయి కాబట్టి తప్పకుండా మీ ఆహారంలో ఒక భాగం చేసుకుంటే మీ ఆరోగ్యం రెట్టింపు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: