పెళ్లయిన ప్రతి స్త్రీకి తల్లి కావడం ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు.బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల బిడ్డ ఆరోగ్యం మెరుగుపడుటమే కాక,తల్లికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.కానీ కొంతమంది తల్లులు బిడ్డ పుట్టిన తర్వాత తాను ఇచ్చే పాలు బిడ్డకు సరిపోతున్నాయో లేదో అని ఆందోళన చెందుతూ వుంటారు.అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోకుండా కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల,బిడ్డకు పుష్కళంగా సరపోయేన్ని పాలు ఉత్పత్తికి దోహద పడతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆకుకూరలు..

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తల్లీలో పాల ఉత్పత్తిని పెంచడానికి  కావాల్సిన పోషకాలు పుష్కళంగా లభిస్తాయి.అందులో విటమిన్ ఎ,సి,కె,ఫోలిక్ యాసిడ్ మరియు కాల్షియం వంటి పోషకాలు ఉండడం వల్ల,తల్లిపాల నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయి.ముదురు ఆకుకూరలను తినే తల్లిలో పాల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడే ప్రొలాక్టిన్ అనే హార్మోనల్ స్థాయిలను పెంచుతాయి.

చేపలు..

డెలివరీ అయిన ప్రతి స్త్రీ కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో చేపలు ఒకటి.ఇందులోని ఒమేగా త్రి ప్యాటి యాసిడ్స్ పాలను ఊత్పత్తి చేయడానికి దోహదపడతాయి.మరియు ఇందులోని విటమిన్ ఏ తల్లి ఆరోగ్యం తొందరగా కుదటపడేలా చేస్తుంది.

వెల్లుల్లి..

వెల్లుల్లి వేసిన ఆహారాలను బాలింతలకు పత్యంగా ఇస్తుంటారు.ఇందులో యాంటీఆక్సిడెంట్ల ఉండటమే కాకుండా,పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది.కొన్ని అధ్యాయనాల ప్రకారం వెల్లుల్లి సప్లిమెంట్ తీసుకోవడంతో చాలా మందిలో పాల ఉత్పత్తి 30% పైగా పెరిగిందని పేర్కొన్నారు.ఇంకా చెప్పాలంటే వెల్లుల్లి వాసన చూసిన వెంటనే కొన్ని రకాల హార్మోన్ లు రిలీజ్ అయి,పాల ఊత్పత్తి పెరుగుతుంది.తల్లిలో వెంటనే పాల ఊత్పత్తి పెరగాలంటే ఆవు పాలలో వెల్లుల్లి వేసి వుడికించుకొని,వెల్లుల్లి నాములుతూ,ఆ పాలను తాగాలి.

డ్రైఫ్రూట్స్..

పాలిచ్చే తల్లి బాదాం,కిస్ మిస్,పిస్తా,జీడిపప్పు,అంజిర్, వంటి డ్రైఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల,పాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా,గట్టిగా వచ్చేలా చేస్తాయి. కొంతమంది తల్లులలో పాలు పల్చగా రావడం వల్ల, పిల్లలకు మోషన్స్ వంటివి కలగవచ్చు.కావున గట్టిపాలు రావడానికి ఈ డ్రై ఫ్రూట్స్ ఎంతో బాగా ఉపయోగపడతాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: