తాంబూలం కోసం వాడే తమలపాకుల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. శుభకార్యాలకు వాడే తమలపాకుల వల్ల ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. పూజకు వాడే తమలపాకుల వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఆకలి వేయడం కోసం తమలపాకులను తింటారు. రుచిగా అనిపించక పోయిన కూడా రెండు తమలపాకులను తింటే ఆకలి వేస్తుంది.
దగ్గును తగ్గించడం లో కూడా తమలపాకులు ఉపయోగ పడతాయి..
విపరీతమైన తల నొప్పి ఉన్నప్పుడు తమలపాకు రసాన్ని నుదిటి మీద తమలపాకుల్ని రాయడం ఇష్టం లేకపోతే తమలపాకుల రసంతో మసాజ్ చేయొచ్చు..
కొబ్బరినూనెనీ తమలపాకురసాన్ని కలిపి చెవిలో వేస్తే చెవినొప్పి నుండి తక్షణమే ఉపశమనం లభిస్తుంది..
తమలపాకుల్ని మరగబెట్టి, ఆ నీటిని చల్లార్చి వజైనా దగ్గర రాస్తే ఆ ప్రాంతంలో వచ్చే దురదని తగ్గిస్తుంది. ఈ నీరు వజైనల్ వాష్ గా కూడా పనికొస్తుంది..
పిల్లలు ఎండలో ఎక్కువగా ఆడితే వారికి ముక్కులోంచి రక్తం కారుతుంది. తమలపాకు రసంతో ఆ సమస్యకి చెక్ పెట్టచ్చు..
తమలపాకు నాచురల్ మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది. ఓరల్ హైజీన్‌ని కాపాడుతుంది. చిగుళ్ళని బలోపేతం చేసి దంతక్షయాన్ని నివారిస్తుంది..
ఇకపోతే ఈ తమలపాకును పుండు మాన్పించడానికి వాడతారు. పుండు, ఏదైనా గాయం తగిలిన ప్రాంతంలో ఈ తమలపాకును పెట్టీ కొద్ది సేపు అయ్యాక తీసేయాలి.. ఇలా చేయడం వల్ల పుండ్లు తొందరగా మానిపోతాయి.
తమలపాకుల్లో ఉన్న యాంటి-ఫంగల్ గుణాల వల్ల రోజూ రెండాకులు నములుతూ ఉంటే ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ దరిచేరకుండా ఉంటాయి.
ఈరోజుల్లో కామన్ విషయం డిప్రెషన్ ..రోజూ తమలపాకుల్ని తీసుకుంటూ ఉంటే మెంటల్ హెల్త్ బాగుండడమే కాకుండా డిప్రెషన్ ని కూడా తగ్గిపోతుంది.
మలేరియా వంటి జ్వరాలకు తమలపాకు మంచి ఔషధం..కేవలం తమలపాకులు మాత్రమే ఒకటో, రెండో తీసుకున్నంతవరకూ మంచిదే. అయితే, అది మీకు పడుతుందా లేదా అని తేల్చే ప్యాచ్ టెస్ట్ మాత్రం తప్పనిసరి. మోతాదుకు మించి తమలపాకులను తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం..ఇప్పుడు తమలపాకును పాన్ లలోనూ వాడుతున్నారు.
చూసారుగా పూజలో వాడే తమలపాకు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఇప్పటి నుంచైనా తమలపాకును తినడం అలవాటు చేసుకోండి..