
ఎంతో మంది డైరెక్టర్లు ఇబ్బందికరంగా ప్రవర్తించారు అంటూ తెలిపింది. అడిగినదానికి ఒప్పుకోకపోతే కెరీర్ నాశనం చేస్తాము అంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారని తెలిపింది. ఇక సీరియల్ లేదా షో పూర్తి చేసిన తర్వాత అసలైన కష్టం ఏర్పడుతుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో ఒక ఆఫర్ వచ్చింది. నువ్వు డైరెక్టర్తో రాత్రంతా ఉన్నావంటే మంచి ఆఫర్ నీ సొంతం అవుతుంది అంటూ మేనేజర్ చెప్పాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యా.. నాకే ఇలాంటి ఆఫర్లు ఎందుకు ఇస్తున్నారు అంటూ అడిగా.. నువ్వు తెలివైన అమ్మాయివి అంటూ ఆన్సర్ ఇచ్చాడు ఆ మేనేజర్ అంటూ అన్ని విషయాలను చెప్పేసింది హీరోయిన్ దివ్యాంకా త్రిపాఠి.
ఇక ఇలా కాసేపటి వరకూ మాటలతో నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తారు.. ఇక అంగీకరించకపోతే కెరియర్ నాశనమవుతుందని బెదిరింపులకు దిగుతారు... ఇలాంటి బెదిరింపులకు ఎప్పుడూ లొంగలేదు.. అంతే కాదు దీన్ని ఎప్పుడూ సీరియస్గా కూడా తీసుకోలేదు.. నా ప్రతిభను నేను నమ్ముకున్న... నా టాలెంటు తోనే ఆఫర్ సంపాదించుకున్నా అంటూ దివ్యాంకా త్రిపాఠి చెబుతోంది. మే తేరి దుల్హన్ అనే సీరియల్ లో నటించి ఎంతగానో పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇలా ఎన్నో సీరియల్ లో నటించి ఆకట్టుకుంది.