మెగాస్టార్ చిరంజీవి తాజాగా బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ సంస్థ నిర్మించిన వాల్తేరు వీరయ్య మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మాస్ మహారాజ రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ప్రకాష్ రాజ్ ... బాబి సింహ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... కేథరిన్ ఒక కీలకమైన పాత్రలో నటించింది.

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేల ఈ మూవీ లో బాస్ పార్టీ అనే స్పెషల్ సాంగ్.లో నటించింది. ఈ మూవీ ని తెలుగు మరియు హిందీ భాషలలో జనవరి 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం 4 పాటలను విడుదల చేసింది. ఈ మూవీ యూనిటీ ఇప్పటివరకు విడుదల చేసిన 4 పాటలకు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి నీకేమో అందమెక్కువ అనే సాంగ్ ను మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. 

తాజాగా ఈ సినిమా నుండి నీకేమో అందమెక్కువ సాంగ్ విడుదల తేదీని మరియు సమయాన్ని అధికారికంగా ప్రకటించింది. వాల్తేరు వీరయ్య మూవీ లోని నీకేమో అందమెక్కువ సాంగ్ ను జనవరి 11 వ తేదీన ఉదయం 10 గంటల 35 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో శృతి హాసన్ అదిరిపోయే స్టైలిష్ లో ఉండగా ... చిరంజీవి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఒక పువ్వును పట్టుకొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: