
ఈ క్రమంలోనే ప్రాజెక్టు - కే సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం కాస్త సోషల్ మీడియాలో తెగచకర్లు కొడుతుంది. భారీ అంచనాల నెలకొన్న ఈ సినిమా అదే రేంజ్ లో బిజినెస్ కూడా చేస్తుంది అన్నది తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో అటు ప్రాజెక్టు-కే ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. దీన్ని బట్టి ఇక సినిమా హైప్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అటు వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఒక విజువల్ వండర్ గా ఉండబోతుందట. ఇక సినీ ప్రేక్షకులందరికీ కూడా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాడట నాగ్ అశ్విన్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన అటు దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక మరోవైపు ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.