తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు మూవీ లో ఫుల్ లెన్త్ హీరోగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా పెళ్లి చూపులు మూవీ తో మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్న ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత గీత గోవిందం ... టాక్సీవాలా మూవీ ల విజయాలతో తన క్రేజీ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరింతగా పెంచుకున్నాడు.

ప్రస్తుతం ఈ యువ నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ ... శివ నిర్వణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత ఈ యువ హీరో పరుశురామ్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విలువడింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా తీసుకోవాలి అని విజయ్మూవీ మేకర్స్ కి సూచిస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా ఈ హీరో పూజా హెగ్డేను సూచించడానికి ప్రధాన కారణం ... ఇది వరకు వీరిద్దరి కాంబినేషన్ లో అనౌన్స్ అయిన జనగణమన సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దానితో విజయ్ తన తదుపరి మూవీ లో పూజా హెగ్డే ను హీరోయిన్ గా సూచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: