నెల్లూరుజిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గం వైస్సార్సీపీ కి కంచు కోట గా ఉంది. 2014 లో వైసీపీ నుంచి మేకపాటి తనయుడు గౌతమ్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించాడు. అప్పుడు కాంగ్రెస్ తరుపున ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేసినా ఇక్కడ ఓడి పోయాడు. అయితే ఇప్పుడు ఆనం వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఆనం .. వెంకట గిరి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. 

Image result for ycp and tdp

అయితే ఈ సారి ఆత్మకూరు లో టీడీపీ తరుపున బొల్లినేని కృష్ణయ్య పోటీ చేస్తున్నాడు. అయితే ఇక్కడ టీడీపీ గత 15 ఏళ్ల నుంచి గెలిచిన దాఖలు లేవు. కాంగ్రెస్ నుంచి ఆ ఓటు బ్యాంకు ఇప్పుడు వైసీపీ కి షిఫ్ట్ అయ్యింది. ఆత్మకూరులో గౌతమ్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్న అతనే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గౌతమ్ రెడ్డి నియోజక ప్రజలకు అందుబాటులో ఉండడని అక్కడ వినిపిస్తున్న మాటలు. 

Image result for bollineni krishnaiah

అయితే ఆత్మకూరు వాసులు జగన్ ను చూసి ఓట్లు వేస్తారు. కాబట్టి ఈ సరి గౌతమ్ రెడ్డి విజయం నల్లేరు మీద నడక లాంటిదని తెలుస్తుంది. అయితే టీడీపీకి ఈ నియోజక వర్గం మీద అంత పట్టు లేకపోవటం మరో మైనస్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది ఇంచార్జిలు మారటంతో గెలుపు అవకాశాలు సంక్లిష్టం అయినాయి. ఆనం రామనారాయణ రెడ్డి కూడా వైసీపీ లోకి జంప్ అవ్వటం తో పార్టీ క్యాడర్ కూడా వైసీపీ లోకి జంప్ అయ్యింది. దీనితో వార్ వైసీపీ వన్ సైడ్ అని బలంగా మాటలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: