తెలంగాణలో వైయస్సార్ టిపి పార్టీ పెట్టిన అప్పటి నుంచి  షర్మిల  రాష్ట్రంలో పర్యటిస్తూనే ఉంది. తన పార్టీకి  పటిష్టం చేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ విధంగా పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే అందులో చేరినటువంటి  కొంతమంది నాయకులు  పార్టీ నుంచి బయటకు వెళ్లారు. దీంతో షర్మిల ఎలాగైనా తెలంగాణలో పట్టు సాధించాలని  వ్యూహాలు రచిస్తోంది. ప్రశాంత్ కిషోర్ ని  త్వరలో రంగంలోకి దించ నున్నారు. ప్రశాంత్ కిషోర్  వ్యూహాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం ఒక వార్త చాలా వైరల్ అవుతోంది. వైఎస్ఆర్ హయాంలో ఆయనతో కలిసి పని చేసినటువంటి నాయకులకు  ఆయన సతీమణి వైయస్ విజయమ్మ ఫోన్ చేసి మరి  మీటింగ్ కి రావాలని ఆహ్వానం పలుకుతోందట.. దీంతో ప్రస్తుతం  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు చెందినటువంటి సీనియర్ నేతలను హైదరాబాద్ లో జరగనున్న మీటింగ్ కి రావాలని వైయస్ విజయమ్మ కబురు పంపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది.

అయితే ఈ యొక్క సమావేశానికి వైయస్ అంతరాత్మ గా చెప్పుకునే అటువంటి కెవిపి రామచంద్ర రావు, ఉండవల్లి అరుణ్, కుమార్, మాజీ పిసిసి చీఫ్ డి శ్రీనివాస్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి,  మరి కొంతమంది సీనియర్ నేతలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొందరికి వైయస్ విజయమ్మ ఫోన్లు చేసినట్టు టాక్ వినబడుతోంది. సుమారు 10 నుంచి 15 మంది ఇతర సీనియర్ నాయకులతో హైదరాబాద్ లోని ఒక హోటల్ లో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే వైయస్ విజయమ్మ నిర్వహిస్తున్నా ఈ మీటింగుకు  వైయస్సార్ టిపి ముఖ్య నాయకులకు ఎవరికి సమాచారం అందలేదు. అయితే ప్రస్తుతం షర్మిల  పార్టీలో ఉన్న నాయకులు కూడా ఒకప్పుడు వైఎస్ఆర్ తో సన్నిహితులు కదా.. అయితే వీరి ప్రమేయం లేకుండా వైయస్ విజయమ్మ ఈ మీటింగు ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ యొక్క సమావేశానికి  వైయస్ కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇది ముఖ్యమంత్రి జగన్ తో పాటు, వైయస్సార్  టిపి అధ్యక్షురాలు షర్మిలను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

 ఎప్పుడూ లేని విధంగా  వైయస్ విజయమ్మ ఈసారి వైయస్సార్ సన్నిహితులతో సమావేశం ఏర్పాటు చేయడం వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటి అని  ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే మొదటి నుంచే  తన బిడ్డ షర్మిలకు  మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు విజయమ్మ. అయితే ఈ సమావేశం ఎందుకోసమని అటు జగన్ పార్టీ నేతలు, షర్మిల పార్టీ నేతలు  ఆలోచనలో పడ్డారని సమాచారం. ఈ సమావేశం ముఖ్యంగా షర్మిల ఆధ్వర్యంలోనే కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం  షర్మిల తెలంగాణలో ఎలాగైనా  రాజకీయంగా పట్టు సాధించడం కోసమే కాంగ్రెస్  టిఆర్ఎస్ నేతలకు వల వేస్తున్నట్లు అర్థమవుతుంది. దాదాపు ఈ సమావేశానికి  150 నుంచి  200 వరకు నేతలు హాజరవుతారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: