భారతీయ రైల్వే శాఖ వినూత్న మార్పులు చేస్తోంది. ఇప్పటికే ప్రయాణికుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు తీసుకుంది. రైళ్ల వేగాన్ని పెంచేసింది. అలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు అన్ని మార్గాలను కూడా డబుల్ ట్రాక్‌లుగా మార్చేస్తోంది. అదే సమయంలో విద్యుదీకరణ చేస్తూ... పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రయత్నిస్తోంది. ప్రయాణీకులకు మెరుగైన సేవు అందించేందుకు కూడా ఎన్నో మార్పులు చేర్పులు చేస్తోంది రైల్వే శాఖ. ఇప్పటికే తేజాస్ పేరుతో ప్రైవేటు రైళ్లు ప్రవేశపెట్టింది. అలాగే అత్యంత వేగంగా దూసుకెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో హై స్పీడ్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది రైల్వే శాఖ. ఇక ప్రయాణీకులకు నాణ్యమైన భోజనం అందించేందుకు కూడా క్యాటరింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. ప్రయాణీకులకు కొత్త సేవలు అందుబాటులోకి తీసుకు రానున్నారు అధికారులు.

ఇప్పటి వరకు విమానాలకే పరిమితమైన హోస్టెస్ సేవలను ఇకపై రైళ్లలో కూడా ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఇప్పటికే తేజాస్ రైళ్లలో హోస్టెస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే అది ప్రైవేటు ఆపరేటింగ్ రైళ్లు. వీటి బాధ్యత మొత్తం ప్రైవేటు సంస్థలే నిర్వహిస్తున్నాయి. ఈ సేవల పట్ల ప్రయాణీకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొన్ని ప్రత్యేక రైళ్లలో కూడా హోస్టెస్ సేవలు ప్రారంభించాలనేది రైల్వే శాఖ భావన. ప్రధానంగా శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ సేవలు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఎయిర్ హోస్టెస్ మాదిరే రైల్ హోస్టెస్ సేవలు ఉంటాయని ఇప్పటికే రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు రైల్‌లోకి ఆహ్వానించడం, వారికి జాగ్రత్తలు చెప్పడం, రిజర్వ్ చేసుకున్న సీట్లను చూపించడం వంటి సేవలు చేస్తారు. తొలుత ప్రీమయం రైళ్లలోనే ఈ సేవలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. శతాబ్ది, గతిమాన్, తేజస్ వంటి ప్రీమియమ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా నియమించనుంది రైల్వే శాఖ. అటు మహిళల భద్రత కోసం కూడా ఇప్పటికే దూర ప్రాంతాలకు వెళ్లే నైట్ సర్వీసులలో కూడా మహిళా రక్షణ సిబ్బంది గస్తీలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: