ఎట్టకేలకు మునుగోడు ఉప ఎన్నిక పర్వం నిన్న ప్రకటించిన ఫలితాలతో ముగిసింది. కేసీఆర్ రాజకీయ చతురత ముందు బీజేపీ ఎత్తులు, వ్యూహాలు నిలబడలేక చతికిలపడ్డాయి. ఫలితంగా బీజేపీని 10307 ఓట్ల తేడాతో తెరాస ఓడించి గెలుపును నమోదు చేసుకుని మరొక నియోజకవర్గాన్ని తమ వశం చేసుకుంది. ఈ ఎన్నికను మూడు ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చివరి వరకు పోరాడాయి. కానీ ప్రజలు మాత్రం అధికార పార్టీకి పట్టం కట్టి మిగిలిన రెండు పార్టీలకు గట్టిగా బుద్ది చెప్పారు. తెరాస తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి మరియు బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు పోటీ పడ్డారు.

అయితే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉప ఎన్నికకు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతికి ముందుగానే ఓడిపోతుందని తెలుసు. ఎందుకంటే ప్రచారంలో సైతం సీనియర్ నాయకుల నుండి సరైన మద్దతు వీరికి దక్కలేదు. ఇక బీజేపీ నుండి రాజగోపాల్ రెడ్డి మాత్రం గెలుపు కోసం ఎంతలా తపించారంటే... ఈ ఎన్నిక గెలవకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేంతలా ప్రచారంలో తన ప్రవర్తన ? చేసిన వ్యాఖ్యలు తెలిపాయి. కానీ ఓటమి గురించి తెలిశాక ఇతను చేసిన వ్యాఖ్యలు తాను ఇంకా భ్రమలో ఉన్నాడా అనిపించింది. ఎన్నికలో తెరాస అనైతికంగా గెలిచిందని ? ఈమె నైతికంగా గెలిచామని కవర్ చేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఏమి  చేయాలో పాలుపోవడం లేదని చెప్పాలి.

ఇప్పుడు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఈ ఓటమి రాజకీయ భవిష్యత్తును దూరం చేస్తుందా ? అన్న విషయం గురించి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మొదటి నుండి కూడా బీజేపీలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎటువంటి స్టెప్ ను తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది. బీజేపీ ఈ ఓటమి భారం నుండి రాజగోపాల్ రెడ్డిని ఆదుకుని ఏదైనా బాధ్యతను అప్పగించి అక్కున చేర్చుకుంటుందా లేదా ఇతనితో ఇంకేమి పని ఉందని పక్కకు వదిలేస్తుందా అన్న వాస్తవం తెలియాలంటే కొంతకాలం వరకు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: