
రియల్ మీ.. ప్రస్తుతం అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్ల అందిస్తున్న బ్రాండ్ రియల్ మీనే. ఇంకా అలాంటి ఈ బ్రాండ్ నుండి ఇప్పుడు మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. అదే రియల్ మీ సీ 11. ఈ స్మార్ట్ ఫోన్ మన దేశంలో లాంచ్ అయ్యింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో భారీ బ్యాటరీని, వాటర్ డ్రాప్ డిస్ ప్లే ను అందించారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో ఒకే ఒక్క స్టోరేజ్ అందుబాటులో ఉంది.
రియల్ మీ సీ11 ధర..
రియల్ మీ సీ11లో కేవలం 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.7,500గా నిర్ణయించారు. ఇంకా ఈ ఫోన్ కు సంబంధించిన సెల్ ఈ నెల 22వ తేదీన ఫ్లిప్ కార్ట్, రియల్ మీ వెబ్ సైట్లలో అందుబాటులో ఉండనుంది.
రియల్ మీ ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు..!
6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
ఇందులో వెనకవైపు రెండు కెమెరాలను అందించారు.
ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ సెన్సార్ కూడా అందించారు.
సెల్ఫీల కెమెరాకు 5 మెగాపిక్సెల్ అందించారు.
32 జీబీ స్టోరేజ్+ మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు అందించారు.
5000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు.
ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ రిచ్ గ్రీన్, రిచ్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది.