
ప్రస్తుతం అతి తక్కువ ధరకే అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు అందిస్తున్న సంస్ద రియల్ మీ. ఇంకా ఇప్పటికే ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు అందించిన రియల్ మీ ఇప్పుడు మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. అదే రియల్ మీ 6ఐ. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ను జులై 24వ తేదీన భారత్ లో మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నారు.
ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఈ ప్రాసెసర్ ను గేమింగ్ ఫోన్లలో ఉపయోగిస్తారు. దీన్ని బట్టి చూస్తే ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేకంగా గేమింగ్ కోసమే తయారు చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ ముందువైపు హోల్ పంచ్ కెమెరా, వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ అందించారు. ఇంకా ఎన్నో అద్భుతమైన ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
రియల్ మీ 6ఐ ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు!
6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఎల్సీడీ హోల్ పంచ్ డిస్ ప్లే,
4 జీబీ ర్యామ్ + 64 జీబీని అందించారు.
వెనుకవైపు నాలుగు కెమెరాలు అందించారు.
ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలను అందించారు.
16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా.
బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్.
'30W ఫాస్ట్ చార్జింగ్'ను ఈ ఫోన్ అందించారు.
ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.15 వేలుగా ఉండే అవకాశం ఉంది.