సుదీర్ఘకాలం పాటు రాజశేఖర్ రెడ్డిని విలన్ గా చూపించినటువంటి రామోజీరావుకి, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఉండవల్లిని ముందు పెట్టి మార్గదర్శి ఫైనాన్స్ మూయించినటువంటి కథ. ఆ తర్వాత దానికి రిటర్న్ గిఫ్ట్ గా ఆయన చనిపోయాక ఆయన కొడుక్కి ఆ గిఫ్ట్ ఇచ్చారు రామోజీరావు గారని వాదన ఉంది. జగన్ ని ఒక రాక్షసుడుగా,  డబ్బులు ఎక్కడ కనపడితే అక్కడ దోచేసుకునే వాడిగా ప్రజలకు ప్రజెంట్ చేశారు. ఒక రాజకీయ నాయకుడు కొడుకుపై ఇంత దారుణంగా, అవమానకరంగా వార్తలు రాసిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు, ఏ పత్రికలకూ లేదు.


అంతలా జగన్ ని వ్యక్తిత్వ హననం చేశారు. అయినా కూడా , తట్టుకుని నిలబడ్డాడు, గెలిచాడు. ముందు ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. ఇప్పుడు అధికార పక్ష నాయకుడు అయ్యారు. జగన్ ని జన్మలో ముఖ్యమంత్రి కానివ్వకూడదు అనుకున్న రామోజీరావుకి కూడా ఆయన విజయాన్ని ఒప్పుకోక తప్పలేదు. తన పత్రికలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వ్రాయకా తప్పలేదు.


 అక్కడితో వాళ్ళిద్దరూ సర్దుకుంటే బాగానే ఉండేదని, కానీ చంద్రబాబుని తప్ప ఇంకెవరిని ముఖ్యమంత్రి సీట్లో చూడలేని రామోజీరావు  ఇప్పుడు మళ్లీ జగన్ ని వెంటాడటం మొదలుపెట్టారని తెలుస్తుంది. మామూలుగా అయితే ఎలక్షన్ ముందు వరకు ఎలా రాసినా, సరిగ్గా ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడుని హైలెట్ చేసే రామోజీరావు, ఇప్పటినుండే అలా రాస్తూ, మరో పక్కన రేపు జగన్ వస్తే భవిష్యత్తు ఏమైపోతుందో అన్నట్లుగా కథనాలు రాసుకుంటూ వస్తున్నారు. దానికి రిటర్న్ గిఫ్ట్ గా జగన్ మార్గదర్శి చిట్స్ సోదాల రూపంలో దెబ్బకొట్టినటువంటి సందర్భం.


అలాగే రెండు విషయాల్లో బాబు గారిని మార్చగలిగారు జగన్. 1. 3దశాబ్దాలుగా గెలుస్తున్న కుప్పంలో ఇప్పుడు చంద్రబాబుని ఇల్లు కొనుక్కునే పరిస్థితికి తీసుకువచ్చారు. 2. 40ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తాను ఎన్టీఆర్ సొంత అల్లుడునని గుర్తు చేస్తూ నిమ్మకూరులో ఒక రోజు నిద్ర చేయడం అనేవి.

మరింత సమాచారం తెలుసుకోండి: