మానసికంగా ఆరోగ్యంగా లేని వారు ఖచ్చితంగా శారీరక ఆరోగ్య పరంగా మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నొప్పులకు వయసుతో సంబంధం లేదు. ఈ నొప్పులు 18 సంవత్సరాల వయసు వారి నుండి 80 సంవత్సరాల వయసు వారి వరకు ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. నొప్పులల్లో కూడా ప్రత్యేకమైన రకాలుంటాయి. వాటిలో ఎక్కువగా సాధారణంగా బాధించే శరీర నొప్పుల్లో తలనొప్పి, నడుము నొప్పి, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు. మరో శరీర నొప్పి కూడా మనల్ని తరచూ బాధిస్తూ ఉంటుంది. నాడీ వ్యవస్థ పనితీరు బలహీనపడుతున్నప్పుడు కూడా శరీరంలో నొప్పులు వస్తూ ఉంటాయి. వేడి చేసే ఆహారపదార్థాలను తినప్పుడు, వాతం చేసే ఆహార పదార్థాలను తినప్పుడు కూడా శరీర నొప్పులు వస్తాయి.ఒక గిన్నెలో కొద్దిగా ఆలివ్ నూనెను తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పును వేసి బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల పేస్ట్ తయారవుతుంది. ఈ పేస్ట్ ను నొప్పి ఉన్న చోట రాయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. వెన్ను నొప్పి, భుజాల నొప్పి, మోకాళ్ల నొప్పి వంటి వివిధ రకాల నొప్పులను కూడా ఈ మిశ్రమంతో తగ్గించుకోవచ్చు. ఆలివ్ నూనె, ఉప్పులో ఉండే ఔషధ గుణాలు వివిధ రకాల నొప్పులను తగ్గిండచంలో ప్రభావవంతంగా పని చేస్తాయి.


ఈ మిశ్రమాన్ని తరచూ వాడడం వల్ల నొప్పులు తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.తినే ఆహార పదార్ధాలు కూడా సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి.పులుపు పదార్థాలు, నూనె పదార్థాలు, బయట దొరికే జంక్ ఫుడ్ ను తిన్నప్పుడు శరీరంలో వేడి, వాతం పెరిగి శరీరంలో నొప్పులు కలగవచ్చు.వేడి శరీరతత్వం ఉన్న వారికి నొప్పులు త్వరగా వచ్చే అవకాశం ఉంది. పెరుగన్నంలో గోంగూర పచ్చడి కలిపి తిన్నా కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఉదయం పూట మనం తినే అల్పాహారాలు, వాటిలోకి తినే చట్నీలు, కారం పొడులు, సాంబార్ లు అన్నీ కూడా శరీరంలో నొప్పులను పెంచేవే. వాటికి బదులుగా ఉదయం పూట మజ్జిగన్నంలో క్యారెట్, బీట్ రూట్, ఉల్లిపాయ, సొరకాయ, లేత బూడిదగుమ్మడి కాయ వంటి కూరగాయ ముక్కలు కలిపి తాళింపు పెట్టుకున్న అన్నాన్ని తింటే ఎటువంటి నొప్పి రాకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: