కొన్ని రకాల జ్యూస్లను తాగడం వల్ల కొద్ది రోజుల్లో బరువు తగ్గి ఈజీగా సన్నబడతారాని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వాటిలోని పోషకాలు శరీరం బరువు తగ్గేందుకు ఎంతగానో ప్రేరేపిస్తాయని.. అందువల్ల ఈ జ్యూస్ తాగితే చాలా మేలని చెబుతున్నారు. మరి బరువు తగ్గేందుకు మనకు ఉపయోగపడే ఆ రుచికరమైన జ్యూస్‌లు ఏమిటో మనం ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.. పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.ఎందుకంటే ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో తినాలనే కోరిక ఈజీగా తగ్గి తొందరగా బరువు తగ్గుతారు. ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఈ పుచ్చకాయ జ్యూస్ ను త్రాగితే ఖచ్చితంగా మీకు చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అలాగే కరివేపాకు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నిత్యం మనం తినే ఆహారంలో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం.అయితే కరివేపాకు కూరల్లో కాకుండా డైరెక్టుగా జ్యూస్ చేసుకుని తాగితే చాలా తొందరగా ఇంకా సులభంగా బరువు తగ్గుతారు. దీనికోసం గుప్పెడు కరివేపాకు గ్లాసు నీళ్లలో వేసి ఆ నీటిని మరిగించుకోవాలి.


అలాగే ఇందులో ఒక స్పూన్ తేనె ఇంకా ఒక స్పూన్ నిమ్మరసం వేసి కలిపి త్రాగడం వలన ఖచ్చితంగా మీరు అధిక బరువును తగ్గించుకోవచ్చు.ఎందుకంటే కరివేపాకులో ఉండే అమైనా ఆమ్లాలు పొట్టలోని కొవ్వును ఈజీగా కరిగించడంలో ఎంతగానో సహాయపడతాయి.ఇంకా అలాగే ప్రతిరోజు ఉదయం పూట టిఫిన్ కి బదులుగా బొప్పాయి జ్యూస్ తీసుకోవడం వలన అధిక బరువు సమస్య నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు. అలాగే ఈ బొప్పాయి లో ఉండే ఫైబర్ పొట్టలోని కొవ్వును చాలా ఈజీగా కరిగించడంలో సహాయపడుతుంది. ఇంకా అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.ఇంకా అలాగే బీట్రూట్-క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది.ప్రతి రోజు ఉదయాన్నే టిఫిన్ సమయంలో ఒక బీట్రూట్ ఇంకా రెండు క్యారెట్లు కలిపి జ్యూస్ లా తయారు చేసుకుని త్రాగాలి. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, ఫైబర్ అధిక బరువును చాలా తొందరగా తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: