
పోషకాలు కలిగిన ఆహారం తినడం వల్ల,యుక్త వయస్సులో వచ్చే గుండె జబ్బులతో మరణాన్ని 18 మరియు 28 శాతం తగ్గించవచ్చని పరిశోధకులు పరిశోదనలు చేసి మరీ నిరూపించారు.కావున గుండె ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.ముఖ్యంగా మన రోజు వారి ఆహారంలో ఒక్క కూరగాయను కచ్చితంగా తీసుకుంటే ఆరోగ్య పరంగా మీ లైఫ్‌కి ఢోకా లేదు.
దీర్ఘ ఆయుష్షుతో జీవించాలంటే ప్రతి ఒక్కరూ రోజూ ఒక కప్పు బీన్స్ తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ప్రొటీన్లు మరియు ఫైబర్ అధికంగా లభిస్తాయి. ఇందులో చెడు కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు.కొన్ని పరిశోదనల ప్రకారం తగినంత ఫైబర్ తీసుకోవడం చాలా ఉత్తమం.
తరుచు బీన్స్ మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల, అది నీరసం, నిసత్తువా,అధిక బీపీ ,షుగర్ వంటి దీర్ఘ కాళిక రోగాలనుండి ఉపశమనం కలిగిస్తుంది.యాంటీ ఆక్సిడెంట్లు మిగతా కూరగాయలు కన్నా ఇందులో ఎక్కువగా లభిస్తాయి.ఇది వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా,మంచి ఆరోగ్యం సమతుల్యతను కాపాడుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.
ఇందులో ఖనిజాలు పుష్కళంగా లభించి,గుండె కండరాలను దృఢపరుస్తుంది.రక్త సరఫరా సజావుగా జరిగి, బీపీ కంట్రోల్ ఉంటుంది. దీనితో యుక్త వయసులో వచ్చే గుండె నొప్పి నుంచి దూరం ఉండవచ్చు.అంతేకాక మాంసం తినని శాఖహరులకు ఇది మంచి ప్రోటీన్ ఆహారం అని చెప్పవచ్చు.ఇందులోని అధిక ఫైబర్ ఉండడం వల్ల జీర్ణసమస్యలు,కిడ్నీసమస్యలను కూడా తొలగిస్తుంది.మరియు బరువు తగ్గాలి అనుకున్న వారు, రోజూ ఏదొక రూపంలో బీన్స్ తీసుకోవడం ఉత్తమం.