లూజ్ మోషన్స్ అనేవి మనల్ని వేధించే జీర్ణ సంబంధిత సమస్యల్లో ప్రధానమైనది.అయితే ఎప్పుడోకప్పుడు ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు.ఈ నీళ్ల విరోచనాల సమస్య తలెత్తడానికి చాలా కారణాలు ఉంటాయి. మన ఆహారం విషతుల్యం అయినప్పుడు, కొన్ని రకాల మందులను వాడినప్పుడు, అలర్జీని కలిగించే ఆహారాన్ని తీసుకున్నప్పుడు, వైరస్ ఇంకా బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల బారినప్పుడు, కలుషితమైన నీటిని తాగినప్పుడు ఈ నీళ్ల విరోచనాల సమస్య తలెత్తుతుంది.సాధారణంగా ఈ సమ్య ఒకరి నుండి మరొకరికి వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ సమస్య నుండి సాధ్యమైనంత ఈజీగా బయటపడాలి. ఈ సమస్య తీవ్రమయ్యే కొద్ది డీహైడ్రేషన్, కడుపు నొప్పి, నీరసం ఇంకా కళ్లు తిరగడం వంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి.కాబట్టి ఈ సమస్య నుండి సాధ్యమైనంత త్వరగా బయటపడాలి.చాలా మంది ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎక్కువగా మందులను వాడుతూ ఉంటారు.


కానీ మందులు వాడే అవసరం లేకుండా చక్కటి ఇంటి చిట్కాతో  నీళ్ల విరోచనాల సమస్య నుండి బయట పడవచ్చు. ఈ టిప్ ని వాడడం వల్ల సత్వర ఉపశమనం లభిస్తుంది.  ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  ముందుగా మనం ఒక టీ స్పూన్ గసగసాలను, ఒక టీ స్పూన్ కండచక్కెర పొడిని ఇంకా రెండు టీ స్పూన్ల ఆవు నెయ్యిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా గసగసాలను అలాగే కండచక్కెరను కలిపి మెత్తగా నూరాలి.ఆ తరువాత కళాయిలో ఆవు నెయ్యి వేసి వేడి చేయాలి.ఇక ఆ నెయ్యి వేడయ్యాక గసగసాల మిశ్రమాన్ని వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై కండ చెక్క కరిగి రంగు మారే దాకా క్యారమెల్ లాగా అయ్యే దాకా కలుపుతూ వేయించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఈ గసగసాల మిశ్రమం చల్లారిన తరువాత దీనిని నోట్లో వేసుకుని నములుతూ మింగాలి. ఇలా చేయడం వల్ల నీళ్ల విరోచనాలనేవి 20 నిమిషాల నుండి అరగంట వ్యవధిలోనే తగ్గు ముఖం పడతాయి. ఈ విధంగా ఈ టిప్ ని వాడడం వల్ల నీళ్ల విరోచనాల సమస్య నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: