బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, తను ఏంటో మరోసారి ఫిల్మ్ ఇండస్ట్రీకి చూపించబోతున్నాడు. ఏదైనా వేడుకల కోసం సల్మాన్ ఖాన్ భారీగా ఖర్చు పెడుతుంటాడు. అలాంటిది, తన సోదరి పెళ్ళి కోసం ఏ రేంజ్ లో ఖర్చు చేస్తాడో అనేది ప్రత్యేకంగా చెప్పనవంసరం లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే, బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ సోదరి అర్పిత ఖాన్ వివాహ వేడుక కోసం తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ ముస్తాబైంది. సోమవారం సాయంత్రం సల్మాన్‌ఖాన్‌తో పాటు పెళ్లికొడుకు ఆయుష్ శర్మ కుటుంబసభ్యులంతా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం వివాహ వేడుక నిర్వహించనున్నారు. బుధవారం అతిథులందరికీ విందుభోజనం ఉంటుంది. వధూవరులిద్దరూ ముంబైకి చెందిన వారైనప్పటికీ చారిత్రక ఫలక్‌నుమాలో పెళ్లి వేడుక కోసం ఆర్నెల్ల క్రితమే ప్యాలెస్‌లోని అన్ని గదులను రిజర్వు చేసుకున్నారు. ఈ వేడుక కోసం బాలీవుడ్ మొత్తం హైదరాబాద్‌కు చేరుకుంటోంది. పెళ్లి వేడుకకు అమితాబచ్చన్, షారుఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్, రజనీకాంత్, కమలహాసన్, హృతిక్ రోషన్ వంటి సూపర్ స్టార్లతో పాటు ప్రముఖ స్టార్స్ అంతా హాజరవుతుందని సమాచారం. ఈ వేడుకలో రాజకీయ ప్రముఖులు కూడా రానున్నారు. అయితే హైదరాబాద్ నుండి మాత్రం అతి మందికే ఇన్విటేషన్స్ అందాయి. ఇప్పటికే విద్యుత్ దీపాలతో ప్యాలెస్ మెరిసిపోతోంది. ఇదిలా ఉంటే పెళ్లి కూతురు అర్పితాఖాన్ సోమవారం ఉదయం నుంచిసాయంత్రం వరకు చుడీబజార్, చార్మినార్ పరిసరాల్లో ఎవరికంటా పడకుండా సాధారణ వ్యక్తిలా షాపింగ్ చేసినట్లు తెలిసింది. పెళ్లి విందు కోసం బిర్యానీతో పాటు పలు రకాల వంటకాలను ప్యారడైజ్ హోటల్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం ఖర్చు దాదాపు 25 కోట్ల రూపాయలు ఉంటుందని బిటౌన్ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: