
ఇక ఇటీవలే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి అందులో ఎప్పుడూ ఏదో ఒక వీడియో చేస్తూ తన అభిమానులకు అల్లరిస్తూ దగ్గరవుతూ వస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఎన్నో కార్యక్రమాలలో లవ్ మ్యారేజ్ గురించి పేరెంట్స్ ని బాధపెట్టిన విషయం గురించి తలుచుకుంటూ లాస్య ఎన్నోసార్లు బాధ పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి తాను పడిన కష్టాలను తలుచుకుంటూ ఒక్కసారిగా బోరున ఏడ్చేసింది. ఇటీవలే జీ తెలుగులో ప్రదీప్ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొంది యాంకర్ లాస్య.
ఇక ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఈ షో లో భాగంగా ఎంతోమంది సోషల్ మీడియా స్టార్స్ బుల్లితెర సెలబ్రిటీలు కూడా ఎంట్రీ ఇస్తారు. ఇందులో భాగంగా యాంకర్ ప్రదీప్ వారితో ఎంతో ఆసక్తికరంగా టాస్కులు ఆడించి ఎంటర్టైన్మెంట్ పంచుతాడు. ఈ క్రమంలోనే అక్కడ వున్న ప్రతి సెలబ్రిటీనీ కూడా ఒక నెటిజన్ వీడియో ద్వారా ఆసక్తికర ప్రశ్న అడుగుతాడు.. ఈ క్రమంలోనే లాస్య వంతు వచ్చేసరికి లాస్య అక్క మీరు ఎప్పుడైనా మని లేక ఇబ్బంది పడ్డారా అంటూ అడగ్గా..ఈ ప్రశ్నకు సమాధానం చెపుతూ తాను ఒకప్పుడు రెంట్ హౌస్ లో ఉండే దాన్ని.. కొన్ని నెలల పాటు డబ్బు లేకపోవడంతో రెంట్ కట్టకుండానే ఉన్నాను. అప్పుడు ఇంటి ఓనర్ అడగడానికి వచ్చినప్పుడు కిటికీ తలుపులు మూసేసి ఇంట్లో సైలెంట్ గా దాచుకున్నాను అంటూ చెబుతూ బోరున ఏడ్చేసింది లాస్య. ఇక పక్కనే ఉన్న ప్రదీప్ లాస్య ను ఓదార్చాడు.