
సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కరోనా లాక్డౌన్ టైం నుంచి బ్యాక్‌డ్రాప్ ఫోటోలు ఎన్నో వచ్చాయి. సెలబ్రిటీలు తమ అభిమానులతో తమ చిన్ననాటి ఫోటోలు షేర్ చేస్తున్నారు. తాజాగా ఒక స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పైన కనిపిస్తున్న ఈ చిన్నారి ప్రస్తుతం సౌత్‌లో టాప్ హీరోయిన్.

ఇప్పటికే పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు త్వరలోనే తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో నటించకపోయినా.. ఆమెకు క్రేజ్ మామూలుగా ఉండదు. ఆమె నటనకు, చిలిపి చేష్టలకు అభిమానులు ఎంతో మంది ఉన్నారు. తన క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో యూత్‌ను కట్టి పడేస్తుంది. ఆమె ఎలాంటి పాత్రలైనా అందులో లీనమై నటిస్తుంది. ఎమోషనల్ సీన్లకు అయితే కన్నీళ్లు పెట్టించేస్తుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?

ఈ అమ్మడు ఎవరో కాదు.. ‘రాజా రాణి’ సినిమాతో సౌత్‌లో ఒక్కసారిగా పాపులర్ అయిన నజ్రియా నజీమ్. 20 డిసెంబర్ 1994లో జన్మించిన నజ్రియా.. సినీ ఇండస్ట్రీకి చెల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యారు. పలు షోలల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే తాజాగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘అంటే సుందరానికి’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 10వ తేదీన విడుదల కానుంది.
నజ్రియా నజీమ్ భర్త ఫహద్ ఫాజిల్ కూడా సినిమా యాక్టరే. తనకు కూడా ఫ్యాన్ ఫాలొయింగ్ అధికంగా ఉంది. కొన్ని సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్‌గా, మరికొన్ని సినిమాల్లో విలన్‌గా కూడా నటించారు. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలో విలన్ పాత్రలో నటించారు. ఇద్దరు టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడం శుభపరిణామమేనని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తన అందం, అభినయం, టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నజ్రియా.. టాలీవుడ్లో తన లక్‌ను పరీక్షించుకోబోతుంది. ‘అంటే సుందరానికి’ సినిమా హిట్ అయితే టాలీవుడ్లో ఆఫర్లు పెరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.