టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును పొందింది. దాని అనంతరం చందమామ సినిమాతో అందరికీ చందమామగా గుర్తుండిపోయింది .దాని తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాలో నటించిన ఈ సినిమాలో చాలామంది ఆమె నటనకు ఫిదా అయ్యారు.మగధీర సినిమా అప్పట్లో  పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసింది. ఈ సినిమా అప్పట్లో  మొదటి పాన్ ఇండియా సినిమాగా పేరు తెచ్చుకునేది.

 ఇక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని ఇటీవల ఒక బాబుకి కూడా జన్మనిచ్చింది కాజల్. ఇక ఇన్ని రోజులు మాతృత్వాన్ని ఎంజాయ్ చేసిన ఈమె భారతీయుడు 2  సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది .తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రెమ్యూనిరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా  డిమాండ్ చేస్తుందట చందమామ. అయితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంది అని అనుకునే లోపే సోషల్ మీడియాలో కాజల్ కి సంబంధించిన

 ఒక వార్త బయటకు రావడం జరిగింది. అయితే ఈ మధ్యన ఒక బాబుకి జన్మనిచ్చిన ఈమె మళ్లీ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు వస్తున్నాయి . దానికి ప్రధాన కారణం జీరో సైజ్ కి వచ్చింది .కానీ తాజాగా ఆమె పొట్ట పెరిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలామంది ఇలా అభిప్రాయపడ్డారు.  ఆమెపై కామెంట్ చేయడం మొదలుపెట్టారు. కాజల్ రెండో బిడ్డకి కూడా జన్మనివ్వబోతుందా అంటూ కామెంట్లు సైతం చేశారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. ఇక ఈ విషయంపై కాజల్ స్పందిస్తే గాని అసలు విషయం ఏంటో తెలియదు. కొందరు మాత్రం ఎంత త్వరగా క్లారిటీ ఇస్తే అంత మంచిది అంటూ కామెంట్లో చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: