
కొన్ని సార్లు హీరో హీరోయిన్ ల జంట కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఒక జంట విషయంలో ఇది నిజమేనని అనిపిస్తోంది. మినిమం గ్యారంటీ హీరోగా పేరున్న యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ గతంలో చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమాతో వచ్చి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుండే దీనికి సీక్వెల్ ను తెరకెక్కించాలన్న ప్లాన్ లో డైరెక్టర్ ఉన్నాడు. కానీ అలా వాయిదా పడుతూ పడుతూ ఆగష్టు లోనే ఈ సినిమాను కార్తికేయ 2 పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మొదటి పార్ట్ లో నిఖిల్ సరసన కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించగా , సీక్వెల్ లో మాత్రం కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.
కథ పరంగా ప్రేక్షకులు బాగా కనెక్ట్ కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద అన్ని భాషలలో మంచి కలెక్షన్ లను సాధించి హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నిఖిల్ మరియు అనుపమల పాత్రలు బాగా పండి సినిమా విజయానికి కారణమయ్యాయి. ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగు నెలల తర్వాత మరో సినిమాతో ఈ హిట్ పెయిర్ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేసిన రొమాంటిక్ లవ్ డ్రామా "18 పేజెస్" గత వారమే థియేటర్ లలోకి ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన ప్రేమకథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో నిఖిల్ మరియు అనుపమల నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. వరుసగా రెండు సినిమాలు వీరిద్దరూ జంటగా వచ్చిన సినిమాలు హిట్ అయ్యాయి. వీరి మధ్యన ఏముందో తెలియదు కానీ సినిమా తీస్తే హిట్ కొడుతున్నారు.