తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతి తక్కువ సమయంలోనే మంచి స్టార్డం అందుకున్న హీరోయిన్లలో రాశి ఖన్నా కూడా ఒకరు.  ఎన్నో హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.తెలుగులోనే కాదు అటు తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించి మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె వెండితెరకే పరిమితం కాకుండా ఓటీటీ లో కూడా సత్తా చాటుతోంది.. రుద్ర వెబ్ సిరీస్ తో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి కూడా ఎంటర్ అయిన రాశి ఖన్నా ప్రస్తుతం ఫర్జీ సిరీస్ లో ఒక లీడ్ రోల్ చేస్తున్న విషయం తెలిసింది.

ఇందులో రెజీనా,  విజయ్ సేతుపతి,  షాహిద్ కపూర్ తదితరులు నటిస్తున్నారు . రాజ్ అండ్ డీకేలు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ఈనెల 10వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.. రాశిఖన్నా మాట్లాడుతూ.. ఫర్జి సిరీస్ లో నేను చేసిన మేఘ వ్యాస్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది . కీర్తి సురేష్,  సమంత లాంటి వారు కూడా బాగుంది అంటూ కామెంట్ చేశారు.  నిర్మాతలు కూడా కంగ్రాట్స్ తెలిపారు.

ఇకపోతే నేను పెళ్లి కోసం సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదు.. తెలుగులో మూడు.. తమిళంలో మూడు కథలు విన్నాను ప్రస్తుతం అవి కూడా ఇప్పుడు చర్చల దశలో ఉన్నాయి. ఫర్జీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను త్వరలోనే నా కొత్త సినిమాలను కూడా ప్రకటిస్తాను.. ముఖ్యంగా నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసే ఏ పాత్రనైనా సరే నేను ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గానే భావిస్తాను అంటూ రాశిఖన్నా చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే ఫర్జీ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆమె కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: