తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన విజయ్ తమిళ్ తో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా విజయ్ "వారసు" అనే తమిళ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా తెలుగు లో వారసుడు అనే పేరుతో విడుదల అయింది.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. రష్మిక మందన ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా వారసుడు సినిమాతో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయింది. త్రిషమూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఈ మూవీ తో పాటు భారీ అంచనాలతో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న సూర్య 42 వ మూవీ కూడా రూపొందుతుంది. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని కూడా అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది కనుక నిజం అయితే ఈ రెండు మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడే అవకాశాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: