లోక నాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో నటించిన కమల్ హాసన్ దేశ వ్యాప్తంగా తనకంటూ నటుడి గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సినిమాలలో నటించిన సరైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేకపోయిన కమల్ హాసన్ పోయిన సంవత్సరం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకొని తిరిగి అదిరిపోయే రేంజ్ ఫామ్ లోకి వచ్చాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కమల్ ... శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2 లో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఇండియన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇండియన్ 2 మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇండియన్ 2 మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో ఒక అదిరిపోయే స్పెషల్ సాంగ్ ను దర్శకుడు శంకర్ క్రియేట్ చేసినట్లు ... ఈ సాంగ్ లో ఊర్వశి రౌటేల నటించనున్నట్లు ... ఈ సాంగ్ కు ఇప్పటికే అనిరుద్ రవిచంద్రన్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చినట్లు ... ఈ సాంగ్ లో కమల్ మరియు ఈ సాంగ్ లో కమల్ అదిరిపోయే మాస్ స్టెప్స్ వేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మరింత సమాచారం తెలుసుకోండి: