తమ సూపర్ స్టార్ మహేష్ అన్న సినిమాకి సంబంధించి నుంచి ఎదో ఒక అప్డేట్ ఇవ్వండని అంటూ రోజూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కామెంట్స్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఇక రోజు రోజుకు మహేష్ ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్ లు ఎక్కువ కావడమే కాకుండా కొంతమంది మహేష్ ఫ్యాన్స్ సహనం కోల్పోయి SSMB28 టీంని బండ బూతులు తిడుతూ ఒక రేంజిలో టార్చెర్ చూపించారు.దీంతో దెబ్బకు మహేష్ ఫ్యాన్స్ కి భయపడి నిర్మతలు ఓ సాలిడ్ అప్డేట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 12 ఏళ్ళ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది. దాంతో ఈ మూవీ అప్డేట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. తాజాగా ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్ చెప్పారు నిర్మాతలు .. ఈ శ్రీరమ నవమికి మహేష్ బాబు 28వ నుంచి అప్డేట్ రాబోతుందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ని పెట్టారు.దాంతో మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 


అయితే శ్రీరామ నవమికి మహేష్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ఇప్పటికే ఈ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతోంది. ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ మాస్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్నాడు.అలాగే ఈ మూవీలో మహేష్ కు జోడీగా ఇద్దరు హాట్ బ్యూటీలు నటించనున్నారు. ఇక వీరిలో ఒకరు స్టార్ బ్యూటీ పూజాహెగ్డే కాగా మరొకరు లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల. ఈ మూవీలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ నుంచి లీక్ అయిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాని చేయనున్నారు.ప్రత్యాంగిర సినిమాస్ SSMB 28 USA రైట్స్ ని కొనుగోలు చేసింది. ఇక ఈ సినిమా USA లో రికార్డు స్థాయిలో 800 పైగా లొకేషన్స్ లో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: