మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇక అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల పుష్ప పార్ట్ 2 కి సంబంధించి ఒక టీజర్ ని కూడా చిత్ర బృందం అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయగా.. ఇక ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఫస్ట్ లుక్ తోనే అటు ఈ సినిమా పేరు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసాడు డైరెక్టర్ సుకుమార్. ఇక ఇప్పుడు పుష్ప పార్ట్ 2 గురించి ఒక ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో తెగచక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఒక అదిరిపోయే అతిథి పాత్ర ఉంటుంది అన్నది తెలుస్తోంది.
ఈ అతిథి పాత్రతో అటు ప్రేక్షకులు కూడా సర్ప్రైజ్ అవుతారట. ఎంతో గ్రాండ్ గా ఈ రోల్ ప్లాన్ చేశాడట డైరెక్టర్ సుకుమార్. అతిథి పాత్ర కోసం బాలీవుడ్ లోని ఒక స్టార్ హీరోను తీసుకురావాలని భావిస్తున్నాడట. మొన్నటికి మొన్న పఠాన్ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ లో సల్మాన్ ఖాన్ కనిపించి అలరించినట్లుగానే ఇక ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కోసం స్టార్ హీరోతో యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. ఇక ఈ అతిథి పాత్ర ఎంతో త్రిల్లింగ్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దీంతో అతిధి పాత్రలో చేయబోయేది ఎవరు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి.