'అందాల రాక్షసి' అనే సినిమాతో తెలుగు వెండితెరకు హీరయిన్ గా పరిచయమైన లావణ్య త్రిపాటి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొదటి సినిమాతోనే ఆకట్టుకునే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ అమ్మడు ఎందుకనో స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. ఇక ప్రస్తుత కాలంలో అడపాదడపా సినీ అవకాశాలతో ముందుకు వెళ్తున్న లావణ్య త్రిపాటికి సంబంధించి ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. అదేంటంటే లావణ్య త్రిపాటికి డబ్బు పిచ్చి ఎక్కువగా ఉందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి వాళ్లైనా సరే డబ్బు ఉంటే వాళ్ళని దగ్గర తీసుకుంటుందట, అదే డబ్బు లేకపోతే వాళ్లని ఈ హీరోయిన్ దూరం పెట్టేస్తుందంటూ ఇండస్ట్రీలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ ఆమె అభిమానులు మాత్రం కావాలనే లావణ్య త్రిపాటిని బ్యాడ్ చేయడానికి టార్గెట్ చేసి మరి ఆమెపై ఇలాంటి వార్తలను వైరల్ చేస్తున్నారంటూ చెబుతున్నారు. లావణ్య త్రిపాఠి సినిమాల్ల్లోకి రాకముందు మిస్ ఉత్తరఖండ్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 2008లో 'అందాల రాక్షసి' అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ లో కొంతమంది అగ్ర హీరోల సరసన నటించిన లావణ్య త్రిపాఠి గత కొంతకాలంగా సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. రీసెంట్ గా ఈ హీరోయిన్ 'పులి మేక' అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ జీ-5 లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్యకాలంలో కొత్త హీరోయిన్ల హవా ఇండస్ట్రీలో పెరిగిపోవడంతో ఈ హీరోయిన్ కి ఆఫర్స్ తగ్గిపోయాయి. దీంతో వచ్చినా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.

ఇక ఈ మధ్యకాలంలో మెగా హీరో వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉందని, వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారనే వార్తలు ఇప్పటికే వినిపించిన సంగతి తెలిసిందే. అయితే వరుణ్ తేజ్ కంటే ముందు మరో హీరోతో ప్రేమలో పడిందట ఈ బ్యూటీ. ఆ హీరో మరెవరో కాదు నవీన్ చంద్ర అని అప్పట్లో వార్తలు తెగ హల్చల్ చేశాయి. అయితే నవీన్ చంద్రకు పెద్దగా బ్యాగ్రౌండ్ లేకపోవడం, ఆస్తులు కూడా ఏం లేకపోవడంతో అదే సమయంలో మెగా హీరో వరుణ్ తేజ్ తో పరిచయం ఏర్పడడం ఆ పరిచయం కాస్త స్నేహంగా మారడంతో నవీన్ చంద్రకు హ్యాండ్ ఇచ్చి డబ్బున్న వరుణ్ తేజ్ వెంటపడుతుంది అంటూ ఫిలిం సర్కిల్స్ లో ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలీదు కానీ లావణ్య త్రిపాటికి డబ్బు పిచ్చి ఎక్కువ ఉండడంతోనే వరుణ్ తేజ్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: