మెగా వారసుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య సంథింగ్ సంథింగ్ ఉన్నట్లు గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఫంక్షన్లో కూడా లావణ్య త్రిపాఠి కనిపించడంతో ఇలాంటి రూమర్స్ మరింత ఎక్కువ అయ్యాయి. వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం వంటి చిత్రాలలో నటించారు.ఈ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం బాగా పెరిగిపోయింది ఆ తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారినట్టు తెలుస్తోంది.


గతంలో వరుణ్ తేజ్ తో డేటింగ్ రూమర్ పై నేటిజెన్లు అడగక వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. దీంతో ఆ రూమర్స్ కాస్త తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ ఈ మధ్య మరొకసారి తెరపైకి ఇలాంటి రూమర్స్ వినిపిస్తున్నాయి.. చాలా గ్యాప్ తర్వాత లావణ్య త్రిపాఠి పులిమేక అనే వెబ్ సిరీస్తో ఓటీటి లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఈమె పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది ఈ సిరీస్ కూడా బాగా మంచి పేరు రావడంతో ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లు వరుణ్ తేజ్ పై లావణ్య చేసిన కామెంట్లు రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చాయి.


అయితే డేటింగ్ వార్తలపై అటు వరుణ్ తేజ్ గాని ఇటు లావణ్య త్రిపాటి కాని ఎప్పుడూ స్పందించలేదు.కేవలం ఇవన్నీ రూమర్స్ గా కంటిన్యూ అవుతూ వచ్చాయి. తాజాగా వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈనెల తొమ్మిదవ తేదీన వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారని సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరి కళ్ళ వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే వీరీ నిశ్చితార్థ వేడుకకు కేవలం కొంతమంది అతిధుల సమక్షంలోనే ఈ వేడుక జరగబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: