సీనియర్ బ్యూటీ జెనీలియా దాదాపు 13 ఏళ్ల గ్యాప్ అనంతరం మళ్లీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. `జూనియర్` మూవీతో ఇక్క‌డి ప్రేక్షకులకు హాయ్ చెప్పేందుకు రెడీ అయింది. రాజకీయ, వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటి హీరోగా అరంగేట్రం చేస్తున్న సినిమానే జూనియర్. శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఒక ముఖ్యమైన పాత్రను జెనీలియా పోషించింది. రాధాకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూలై 18 విడుదల కాబోతోంది.


ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో బుధవారం చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. దర్శకధీరుడు రాజమౌళిఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన హీరో కిరీటి, సినిమాటోగ్రాఫర్ సెంథేల్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ తదితరుల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే జెనీలియా గ్లామర్ పై జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


`జెనీలియా అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. అదే అందం.. అదే గ్రేస్‌.. ఏం మాత్రం తగ్గలేదు. ఈ సినిమాలో జెనీలియాను కొత్తగా చూస్తారని సెంథేల్ ప్రామిస్ చేశాడు. సో నేను కూడా ఆమెను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న` అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. ఆయన కామెంట్స్ జెనీలియా తెగ సిగ్గు పడిపోయింది. కిందనుంచే జ‌క్క‌న్న‌కు థాంక్స్ చెప్పింది. కాగా, జూనియ‌ర్ మూవీ వెయ్యికి పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ కాబోతుంది. ఇప్ప‌టికే ఈ మూవీపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. రీసెంట్ గా బ‌య‌ట‌కు వ‌చ్చిన `వైర‌ల్ వ‌య్యారి` సాంగ్ ఆ అంచనాల‌ను మ‌రింత పెంచేసింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: