
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏలూరులో తన రెండవ విడత ప్రజాపోరాట యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏలూరులో క్రైస్తవుల బోధకుల తో పాస్టర్ ల తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన జీవితం బాల్యం గుర్తుచేసుకుంటే క్రైస్తవ్యానికి చాలా దగ్గరగా ఉంటుందని అన్నారు. ఇందుమూలంగా నేమో కానీ నా ఇద్దరు పిల్లలని క్రిస్టియన్లుగా దేవుడు పుట్టించాడన్నారు.
అంతేకాకుండా తాను నెల్లూరులో సెయింట్ జోసెఫ్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో చదువుకున్నానని పవన్ గుర్తు చేశారు. క్రిస్టియానిటీ అంటే అందరి దృష్టిలో ఒక మతమే కావొచ్చు అని తనకు మాత్రం బాధ్యత అని తెలిపారు. తనకు దేశభక్తి నేర్పింది కూడా క్రిస్టియన్ స్కూలేనని తెలిపారు. ఓ బాధ్యతతో ఇంతదూరం తన ప్రయాణం సాగిందంటే అందుకు కారణం ఆ పాఠశాలలో నేర్చుకున్న విషయాలేనన్నారు.
చిన్ననాటి నుంచి సర్వమతాల సారాన్ని అర్థం చేసుకుంటూ వస్తున్నానని తెలిపారు. విదేశాల నుండి వచ్చిన క్రైస్తవ్యం భారతదేశానికి ప్రజలకు చాలా మేలు చేసిందని పేర్కొన్నారు. ముఖ్యంగా భారతదేశం అభివృద్ధి లో నడవడానికి భారత ప్రజలు చదువుకోవడానికి ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పించింది క్రైస్తవ్యం అని ఈ సమావేశంలో పేర్కొన్నారు.
ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే మతానుసారంగా కులాల పరంగా ఓట్ల కోసం రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారని అన్నారు. దేశంలో క్రైస్తవుల పై దాడి కూడా జరుగుతున్నాయని..జనసేన అధికారంలోకి వస్తే కచ్చితంగా అటువంటివి జరగకుండా క్రైస్తవుల పట్ల బాధ్యతగా ఉంటానని ఈ సందర్భంగా పాస్టర్లకు హామీ ఇచ్చారు పవన్. దేవుడి దయవల్ల నాకు అన్ని మతాలలో అభిమానులు ఉన్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి మతాన్ని గౌరవిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.