
దీంతో సోము వీర్రాజు పట్ల పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.సోము వీర్రాజు ఒక వర్గానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఇప్పటికే వినిపిస్తున్నాయి.దీంతో సోము వీర్రాజు పై సొంత పార్టీ నేతలు డిల్లీకి పిర్యాదులు పంపుతున్నారని సమాచారం. ఈ సమయంలో తిరుపతిలో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని ఆయన చేసిన ఏకపక్ష ప్రకటన జనసేనకు ఆగ్రహం తెప్పించింది. బీజేపీకి నోటా కంటే తక్కువ ఓ ట్లు వచ్చాయని.. అలాంటిది తమను కనీసం సంప్రదించకుండా అభ్యర్థిపై ఎలా ప్రకటన చేస్తారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి సిద్దమైనట్టు తెలుస్తుంది .ఇప్పటికే తిరుపతి సీటుపై ఓ కమిటీని వేశారు.తిరుపతిలో బలమైన సామాజికవర్గం జనసేన కు మద్దతిచ్చే అవకాశం ఉందని జనసేన గట్టి నమ్మకం. అన్నిటికన్నా ముఖ్యంగా తిరుపతిలో 2009లో చిరంజీవి ఎమ్మెల్యేగా గెలవడాన్ని ప్రస్తావించింది.
రాష్ట్రానికి హోదా గురించి బీజేపీ అక్కడే హామీ ఇచ్చి.. మాట మార్చడం, తిరుపతి అభివృద్ధి అంతా తామే చేశామని కమలనాథులు చెబుతున్నా తిరుపతికి ఒక్క అంతర్జాతీయ విమానం లేకపోవడం, ఐఐటీ ఇచ్చినా సొంత భవనాలకు నిధులు మంజూరు చేయకపోవడం లాంటివన్నీ జనసేన కమిటీ గుర్తించింది. బీజేపీ పోటీ చేసినా ప్రజలు ఆదరించే అవకాశం లేదని. జనసైనికులు భావిస్తున్నారు.అందువల్ల జనసేన అభ్యర్థిని బరిలో నిలుపే దిశగా జనసేనాని ఆలోచిస్తున్నారని తెసుస్తుంది.. గెలుపు సంగతి పక్కన బెట్టినా కేడర్‌లో ఊపు వస్తుందని జనసేన అంచనా వేసింది. కమిటీ ఇచ్చిన సమాచారంతో స్థానిక నేతలకు పవన్ సిగ్నల్ ఇచ్చారు. జనసేన అభ్యర్థే బరిలో ఉంటారని అన్యాపదేశంగా తెలియజేశారు.మరి దీనిపై బిజేపి అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారింది.