
అఫ్గనిస్తాన్‌లో ఆగస్టు 15న ఓ మహిళా క్రీడాకారణిని పొట్టన పెట్టుకున్నారనే సమాచారం సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. చంపబడిన ఈ క్రీడాకారిణి పేరు మొహజమీన్ హకీమీ అని చెబుతున్నారు. ఈ హత్యకు సంబంధించి అఫ్గన్ మీడియా సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చారు. హకీమీ హత్యకు ఒక కారణం ఆమె మైనారిటీ హజరా వర్గనికి చెందిన వారు కావొచ్చని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. తాలిబన్‌లు ఈ మైనారిటీ సమూహాన్ని ద్వేషిస్తారు పైగా మహిళలు క్రీడల్లో పాల్గొనడాన్ని ఇది వరకే నిషేధించారు.
ఈ సంఘటన గురించి వాలీబాల్ క్రికెట్ జట్టుకోచ్ సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన కొన్ని రోజుల పాతది అయితే ప్రపంచం ఈ విషయం గురించి ఇప్పుడే తెలుసుకుంది. మెహజపీన్ హత్య గురించి ఆమె కుటుంబ సభ్యులకు ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే ఈ విషయాన్ని బయటపెట్టొద్దని ఆ కోచ్‌ను బెదిరించారు. మీడియా ఇచ్చిన నివేదికలు, ఇతర సమాచారం మేరకు మెహజపీన్ వాలీబాల్ క్రీడాకారిణి మాత్రమే కాదు.. ఇతర క్రీడీకార్యక్రమాల్లో పాల్గొంటారు.
అష్రఫ్ ఘనీ ప్రభుత్వ కాలంలో ఆమె తరచుగా క్లబ్‌కు వెళ్లేది ఆమె మరణం తరువాత ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజుల క్రిత్రం అఫ్గన్ మహిళ క్రికెట్ టీం క్రీడల్లో పాల్గొనద్దని ఆదేశాలు జారీ చేసింది తాలిబన్ ప్రభుత్వం. అఫ్గన్ లో ఉన్న మహిళా క్రీడాకారులకు ఎప్పటికైనా ముప్పుతప్పదని విశ్లేకులు భావిస్తున్నారు.