
మొన్నటి వరకూ సౌదీ అరేబియా లో కూడా ఇలాంటి కఠిన ఆంక్షలు కొనసాగాయ్. కానీ ఇటీవలి కాలంలో చట్టాల్లో మార్పులు తీసుకు వస్తూ మహిళలకు స్వేచ్ఛ కల్పిస్తూ సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే ఇస్లామిక్ దేశాల్లో ఒకటైన ఇరాక్ లో కూడా ఇలాంటి తరహా ఆంక్షలు అమలులో ఉన్నాయి . కానీ గత కొంత కాలం నుంచి ఇస్లామిక్ చట్టాల్లో మార్పులు తీసుకొస్తుంది. మహిళలకు స్వేచ్ఛ కల్పిస్తుంది అన్ని రంగాల్లో రాణించడానికి అవకాశం కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే ఇటీవల ఇరాక్ మహిళలు మహిళా సాధికారత సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్న విషయం అర్థమవుతుంది. మహిళల పట్ల కఠిన ఆంక్షలు కొనసాగే ఇస్లామిక్ దేశంలో ఏకంగా మహిళలు భారీ మొత్తంలో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నారట. ఇటీవలే ఏకంగా కిక్ బాక్సింగ్ లో ఇరాక్కు చెందిన ఒక మహిళ పేరు నమోదు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ లో లాగానే అమెరికా సైన్యం ఇరాక్ ను వదిలి పెడితే మళ్లీ ఉగ్రవాదులు తమ ఆధిపత్యాన్ని సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇక తమకు తాము ఆత్మరక్షణ కల్పించుకోవడానికి ఇరాక్ మహిళలు ఇలా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.