మానసిక ఒత్తిడి మామూలు మానవులకే కాదు వైద్యులకు కూడా ఎక్కువగానే ఉంటోంది.  కర్ణాటక రాజధాని బెంగళూరులో  వైద్యురాలు అత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె మృతికి మానసిక ఒత్తిడే కారణని పోలీసులు తెలిపారు. ఇంతకీ ఆ వైద్యురాలు ఎవరో తెలుసా ? కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్డ్యూరప్ప ముద్దుల మనుమరాలు డాక్టర్ సౌందర్య బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమెకు ఆరు నెలల బిడ్డు కూడా ఉన్నారు. యడ్యూరప్ప పెద్ద కుమార్తే పద్మ కూతురే డాక్టర్ సౌందర్య. ఈమెకు డాక్టర్ నీరజ్ తో రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరు బెంగళూరులోని  అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. కొంతకాలం సజావుగా సాగిన వీరి సంసారంలో కలతలు వచ్చినట్లు కన్నడ మీడియా వర్గాల కథనం.  డాక్టర్ నీరజ్ ఈ ఉదయం యధావిధిగా తాను పనిచేస్తున్న ఆసుపత్రికి వెళ్లారు. ఆ తరువాత కొద్ది సేపటికి ఇంట్లో పనులు చేసే పనిమనిషి వచ్చి తలుపు తట్టగా డోర్ ఓపన్ రాలేదు. దీంతో ఆమె డాక్టర్ నీరజ్ కు ఫోన్ చేశారని, ఆయన వచ్చి తలుపు తట్టగా ఎంతకా తెరచుకోలేదని పోలీసులు తెలిపారు. దీంతో బలవంతంగా డోర్ ను ఓపన్ చేసి చూడగా డాక్టర్ సౌందర్య ఆత్మహత్యకు పాల్పడి విగతజీవిగా కనిపించారు. దీంతో సౌందర్య మృతదేహాన్ని పోర్టుమార్టం నిమిత్తం సమీపంలోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి  బసవరాజ్ బొమ్మై, ఇతర మంత్రి వర్గ సహచరులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు.  డాక్టర్ సౌందర్య మరణించిన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించ లేదని పోలీసులు మీడియాకు తెలిపారు.  సహజ మరణంగానే కేసు నమోదు చేసినట్లు కూడా తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన వెంటనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కోన్నారు.  డాక్టర్ సౌందర్య ఇటీవలి కాలంలో ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనైనట్లు తమ దృష్ట్కి వచ్చిందని కూడా పోలీసులు తెలిపారు. కారణాలు  ఏమైనా డాక్టర్ సౌందర్య మృతి  కారణంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇంటి  విషాధం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: