ఈ మధ్యకాలంలో కొంతమంది జనాలు చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు.  ఎంతలా అంటే కళ్లారా చూసింది నిజం కాకుండా ఎవరో ఏదో చెప్పాడు అంటూ మూఢనమ్మకాలకు పోయి అభం శుభం తెలియని వాళ్లను దారుణాతి దారుణంగా హింసిస్తున్నారు.  రీసెంట్గా  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర అమానుష ఘటన గురించి అందరికీ తెలిసిందే .  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కుడితిపాలెం గ్రామం కాకర్ల దిబ్బలో ఓ అమానుష ఘటన జరిగింది .


పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.." పదేళ్ల  చిన్నారికి తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమె మేనత్త మణికల ఊరు తీసుకొచ్చి ఆమెను పెంచుకుంటుంది . అయితే ఆ బాలిక పొరుగు ఇంట్లో ఉన్న నాగరాజు ఫోన్ దొంగతనం చేసింది అంటూ ఆరోపణలు ఎదుర్కొంటుంది.  నాగరాజు ఫోన్ శనివారం పోయింది. దీంతో  జ్యోతిష్యుడు వద్దకు వాళ్ళు వెళ్ళగా పక్కింట్లో ఉన్న చిన్నారి చోరి చేసింది అంటూ ఆ జ్యోతిష్యుడు చెప్పి చెప్పగానే నాగరాజు ఆయన భార్య సుబ్బమ్మ చుట్టుపక్కల వారి సహాయంతో  ఆ అమ్మాయి పై అనుమానంతో లాకెళ్లి పోయి వద్ద పడుకోబెట్టి అట్లకాడ కాల్చి ..మూతి పై నాలుకపై చేతులపై దారుణాతి దారుణంగా హింసిస్తూ వాతలు పెట్టారు.



ఇది గమనించిన స్థానికులు 112 కి ఫోన్ చేసి చెప్పడంతో ఎస్సై నాగార్జున రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.  అంతేకాదు వెంటనే చిన్నారిని వైద్య సహాయం కోసం దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లారు . అక్కడే ఐదుగురిని అదుపులకు తీసుకొని హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు . దీనిపై  టిడిపి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చలించిపోయారు . అంతేకాదు ఆ బాలికకు అన్ని సదుపాయాలు ఉండేలా ప్రత్యేక మెరుగైన వైద్యం కోసం వెంటనే అపోలో ఆసుపత్రిలో చేర్పించాలి అంటూ టిడిపి నేతలకు ఆమె సూచించారు.



ఇందుకూరుపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను వెంటనే అపోలో ఆసుపత్రిలో చేర్పించాలి అంటూ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చెప్పడంతో టిడిపి నేతలు కోడూరు కమలాకర్ రెడ్డి , దువ్వూరు కళ్యాణ్ రెడ్డి , పవన్ రెడ్డి , షేక్ ఇంతియాజ్ ఆ బాలికను నెల్లూరులోని అపోలో హాస్పిటల్ లో చేర్పించారు . అంతేకాదు ఆమె ఆరోగ్యం పై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాలి అంటూ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆ నేతలకు చెప్పుకొచ్చారు.  అంతేకాదు ఆ బాలిక పరిస్థితి మెరుగయ్యాక వేమిరెడ్డి ట్ర్స్ట్ ద్వారా ఆమెకు అన్ని బాగోగులు చూసుకుంటామని.. ఆమెకి కష్టమంటే ఏంటో తెలియకుండా చూసుకుంటామని .. చదువు మిగతా అన్ని విషయాలలో ఆమెకి తోడుగా ఉంటామని ప్రశాంతి రెడ్డి తెలిపారు . చదువుతోపాటు పూర్తి బాధ్యతలు ఆ బాలకవి ఇక మావే అంటూ ఆమె చెప్పడం ఆమె మంచి మనసుకి నిదర్శనం అంటూ జనాలు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని పొగిడేస్తున్నారు.  కేవలం ఈ విషయంలోనే కాదు గతంలో చాలా సందర్భాలలో టిడిపి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇలా తన మంచి గొప్ప మనసును చాటుకున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని పై ప్రశంసల వర్షం కురిపించేస్తున్నారు మహిళలు, అభిమానులు, జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: