
90 లక్షలు కొన్న ఈ ఆటగాడు ఇక లక్నో జట్టు ఆడిన మూడు మ్యాచ్ లలో కూడా అతనికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. మూడు మ్యాచ్ లు కూడా బెంచ్ కే పరిమితం అయ్యాడు ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో మాత్రం మనీష్ పాండే స్థానంలో కృష్ణప్ప గౌతమ్ జట్టు లోకి వచ్చాడు అని చెప్పాలి. ఇక లక్నోకు కొరకరాని కొయ్యగా మారి బ్యాట్ తో విరుచుకు పడుతున్న పృథ్వీ షా ను పెవిలియన్ పంపించి అటు లక్నో జట్టుకు చూపించిన విధంగా మేలు చేశాడు కృష్ణప్ప గౌతం. నాలుగు ఓవర్లు వేసి 23 పరుగులు ఇచ్చి ఒక కీలకమైన వికెట్ తీసుకున్నాడు.
ఇలా జట్టుకు అవసరమైన సమయంలో తనదైన శైలిలో బౌలింగ్ చేసి అదరగొట్టాడు కృష్ణప్ప గౌతమ్. వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కృష్ణప్ప గౌతమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అందరు. మ్యాచ్ అనంతరం లక్నో ఆల్రౌండర్ జెసన్ హోల్డర్ మాట్లాడుతూ కృష్ణప్ప గౌతమ్ జట్టులోకి రావడం తమకు ఎంతగానో మేలు చేసింది. అతడు బంతి తోనే కాదు బ్యాట్ తో కూడా రాణించగలడూ అంటూ ప్రశంసలు కురిపించాడు.