ఆట అంటే గెలుపు ఒకటే కాదు ఓటమి కూడా. అయితే గెలుపును మాత్రమే కాదు ఓటమిని కూడా ఒకేలాగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన ఆటగాళ్లే ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే క్లిష్ట పరిస్థితుల్లో సైతం కొంతమంది ఇక తమ దేశాన్ని గెలిపించడం కోసం కష్టపడే తీరు సైతం ప్రేక్షకులను ఫిదా చేసేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి కోవలోకే వస్తారు ఆస్ట్రేలియా, ఇండియా జట్ల తరపున ఆడుతున్న ఫాస్ట్ బౌలర్లు  స్టార్క్, ఉమేష్ యాదవ్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు తమ తమ జట్లను గెలిపించుకునేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్నారు  అన్న విషయం తెలిసిందే.


 ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగియక ప్రస్తుతం ఇండోర్ వేదికగా మూడవ టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంది అని చెప్పాలి. కాగా మూడో టెస్ట్ మ్యాచ్లో మహమ్మద్ షమి స్థానంలో ఉమేష్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. అదే సమయంలో మిచెల్ స్టార్క్ సైతం ఆస్ట్రేలియా జట్టు తరఫున గాయం నుంచి కోలుకొని వచ్చి బాగా రాణిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా జట్టు మూడో టెస్టులో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన సమయంలో ఉమేష్ యాదవ్ తన బౌలింగ్ తో వనికించాడు. ఏకంగా మూడు వికెట్లు తీసి కంగారులకు కంగారు పుట్టించాడు.



 అయితే ఫిబ్రవరి 28నే ఉమేష్ యాదవ్ తండ్రి కన్నుమూసారు. అయితే ఇలా తండ్రి పోయిన బాధను భరిస్తూ పుట్టెడు దుఃఖాన్ని మనసులో పెట్టుకొని ఉమేష్ యాదవ్ దేశం కోసం పోరాడుతూ అద్భుతమైన బౌలింగ్ చేసి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. ఇక మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ సైతం ఇలాగే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. రెండో ఇన్నింగ్స్ లో అతడు కీలకమైన శ్రేయస్ అయ్యర్ వికెట్ తీసాడు. అయితే బౌలింగ్ చేస్తున్నప్పుడు అతడి చేతి వేలికి గాయం అయింది. రక్తం కూడా వచ్చింది. కానీ రక్తం కారుతున్న అతను మాత్రం బౌలింగ్ చేయడం ఆపలేదు అని చెప్పాలి. ఇక ఫలితంగా శ్రేయస్, పూజార భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అయ్యర్ వికెట్ దక్కింది. ఇక ఇద్దరి క్రీడా స్ఫూర్తికి క్రికెట్ ప్రేక్షకులు సలాం కొడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: