
ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామానికి చెందిన యువతికి 2010లో సొంత మేనమామ తో వివాహం జరిగింది. ఇక మనస్పర్ధలు రావడంతో 2015లో విడాకులు తీసుకొని విడిగానే ఉంటున్నారు ఇద్దరు. కాగా రెండేళ్ల తర్వాత ఆమెకు సాయి చరణ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇక ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఖమ్మం లోనే కాపురం పెట్టారు. కాగా సాయి చరణ్ కు కరుణాకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడగా యువకుడు ఇంటికి వెళ్ళి వస్తూండేవాడు. ఇలా వచ్చి పోయే దారిలో సాయిచరణ్ భార్యతో చివరికి అక్రమ సంబంధానికి తెరలేపాడు.
విషయం తెలిసిన సాయిచరణ్ భార్యను కొన్నిసార్లు హెచ్చరించాడు. అయితే భర్తకు విషయం తెలిసిపోయిందని మరికొంతమందికి చెబితే తన పరువు పోతుందని భావించింది. భర్త ని చంపాలని ప్లాన్ వేసింది. కాగా ఇటీవలే తాను డ్రైవర్గా పనిచేస్తున్న వాహనాన్ని తీసుకొని ఏపీ లోని ఎన్టీఆర్ జిల్లాకు బయలుదేరాడు సాయి చరణ్. అయితే మార్గమధ్యంలో ఖమ్మంలోని శ్రీనివాస్ నగర్ లో మద్యం తీసుకొని ఇక సాయి చరణ్ పిలిచాడు కరుణాకర్. ఈ క్రమంలోనే ఇద్దరు గొడవ పడ్డారు. ఆ తర్వాత సాయి చరణ్ ను హత్య చేసి అదే వాహనంలోని కోడిపెంట మధ్య దాచి పెట్టాడు. వాహనాన్ని ఒక చెరువు లో పడేశాడు. వివాహిత ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో విషయం బయటపడింది. దీంతో నిందితులను అరెస్టు చేశారు.