టాప్ హీరోయిన్ గా ఎదిగే అన్ని క్వాలిటీస్ ఆమెలో ఉన్నాయి.  కేరీర్ మంచి స్టేజి లో ఉన్నది అనగా సినిమాలు పక్కన పెట్టి వివాహం చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది.  అక్కడే సెటిల్ అయ్యింది.  మొదటి బిడ్డకు జన్మను ఇచ్చిన తరువాత ఈ అమ్మడు మీడియాకు కనిపించింది.  


మీడియా ముందుకు వచ్చిన ఈ అమ్మడును చూసి షాక్ అయ్యారు. చాలా లావుగా ఉన్నారని హేళన చేయడంతో ఆమెకు కోపం వచ్చింది.  వెంటనే జిమ్ కు వెళ్లి కసరత్తులు చేసి బరువు తగ్గి స్లిమ్ గా కనిపించింది.  ఇప్పుడు సమీరా రెండో బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నది.

గర్భవతిగా ఉంటూనే ఫోటోషూట్ లు చేసింది.  బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది.  అంతేకాదు, అండర్ వాటర్ ఫోటో షూట్ చేసింది.  ఈ ఫోటోలకు మంచి రెస్పాన్స్ కూడా రావడం విశేషం.  ఏమైందో ఏమో తెలియదుగాని, సమీరా సడెన్ గా కాజల్ బాటలో పయనించేందుకు సిద్ధం అయ్యింది.  


కాజల్ మేకప్ లేకుండా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది కదా.  అలానే, సమీరా కూడా రీసెంట్ గా మేకప్ లేకుండా తన ఫోటోలను షేర్ చేసింది.  అయితే, అది ఫోటోల రూపంలో కాకుండా, చిన్న వీడియో రూపంలో షేర్ చేసింది.  ఈ ఇంస్టాగ్రామ్ వీడియోపై అనేక కామెట్స్ వస్తుండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: