పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కొద్దిగా బ్రేక్ ఇచ్చి సినిమాలు చేస్తున్నాడు . సినిమాలు చేస్తూనే రాజకీయాలు కూడా చేస్తున్నారు.  రెండింటిని వదలకుండా చేసుకుంటూ వెళ్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన 26 వ సినిమా వకీల్ సాబ్ వేగంగా షూటింగ్ జరుగుతున్నది.  ఈ సినిమా తో పాటుగా 27 వ సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 


సినిమా ఔరంగజేబు కాలానికి చెందిన సినిమాగా చెప్తున్నారు.  అందులో పవన్ పాత్ర చాలా  అద్భుతంగా ఉండబోతుందని అంటున్నారు.  ఇంతవరకు బాగానే ఉన్నది.  అయితే, ఇక్కడ అసలు కథ మొదలైంది.  పవన్ కళ్యాణ్ 28 వ సినిమాను కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు.  29 వ సినిమా ఎవరితో అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలీవుడ్.  ఈ 29 వ సినిమాను నిర్మించే అవకాశం కోసం బండ్ల గణేష్ ప్రయత్నం చేస్తున్నాడు.  


ఒకప్పుడు బండ్ల గణేష్ చిన్న చిన్న పాత్రలు చేసేవాడు.  ఆ తరువాత నిర్మాతగా మారి సినిమాలు తీయడం మొదలుపెట్టాడు.  పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ కు ప్రత్యేకమైన అభిమానం ఉన్నది.  పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా తీశాడు.  ఈ మూవీ మంచి విజయం దక్కించుకుంది.  ఆ తరువాత ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా తీశాడు.  తరువాత ఏమైందో తెలియదు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ రాజకీయాల్లోకి వెళ్ళాడు.  


కానీ, అక్కడ సక్సెస్ కాలేకపోవడంతో యూ టర్న్  తీసుకొని సినిమాల్లోకి వచ్చాడు.  సినిమా రంగంలోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఓ చిన్న పాత్ర చేశాడు.  అయితే, ఇప్పుడు బండ్లగణేష్ మరలా నిర్మాతగా తన ప్రస్థానం మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.  పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ అనుకుంటున్నాడట.  దానికోసమే పావులు కదుపుతున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: