
ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించబోతున్నారని తెలిశాక బాహుబలిని మించిన అంచనాలు ప్రేక్షకుల్లో పెరిగిపోయాయి.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు టీజర్లు విడుదల కాగా.. రెండింటికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. క్లైమాక్స్ షూటింగ్ కూడా మొదలైందంటూ ఇటీవల దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నిజానికి ఈ చిత్రం 2020 జూలైలోనే రావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీంతో 2020 జూలై నుంచి 2021 జనవరికి పోస్ట్ పోన్ అయింది.
అయితే మళ్లీ 2021 జనవరిన కూడా ఈ చిత్రం రావడం లేదని చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ఈ చిత్రం 2021లో కూడా వచ్చే అవకాశం లేదని ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. కానీ.. తాజా అప్డేట్‌తో అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కొంత మంది అభిమానులు మాత్రం అక్టోబర్ 13వ తేదీ కూడా వచ్చే అవకాశం ఉండకపోవచ్చని, రాజమౌళి ఈ సారి కూడా సినిమాను కచ్చితంగా పోస్ట్ పోన్ చేస్తాడంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.