
రామ్ పోతినేని : టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఇప్పటి వరకూ తన కెరీర్ లో ఎప్పుడూ ద్విపాత్రాభినయం చేయలేదు. కానీ ఈ ఏడాది రెడ్ సినిమాలో ద్విపాత్రాభినయంలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తమిళ సినిమా అయినా తడమ్ అనే సినీమా ఆధారంగా రూపొందిన ఈ మాస్ త్రిల్లర్ లో సిద్ధార్థ్,ఆదిత్య అనే కవల సోదరులు రామ్ పోతినేని నటించారు. ఈ ఏడాది జనవరి 14న ఈ సినిమా విడుదల అయ్యింది.
బాలకృష్ణ : టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ సినిమాలో ద్విపాత్రాభినయంలో నటించి మెప్పించాడు. ఒక పాత్రలో అఘోర, మరొక పాత్రలో మురళీకృష్ణ గా నటించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 2న విడుదల అయ్యింది.
నాని : టాలీవుడ్ హీరో నాని నటించిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా ఇటీవలే క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 24న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఇందులో నాని కూడా ద్విపాత్రాభినయంలో నటించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. 19 70 కాలంనాటి బెంగాలీ యువకుడిగా సాం సింగరాయ్ గా, పట్టణంలో కనిపించే తెలుగు కుర్రాడుగా వాసుగా ఇలా రెండు డిఫరెంట్ పాత్రలలో కనిపించారు.