తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటుడిగా  తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో ఒకరు అయినటు వంటి అడవి శేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అడవి శేషు తన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించాడు , కానీ ఆ సినిమాల ద్వారా అడవి శేషు కు పెద్దగా గుర్తింపు లభించలేదు. ఇది ఇలా ఉంటే అడవి శేషు "క్షణం" మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన గుర్తింపును దక్కించుకున్నాడు.

క్షణం మూవీ తో అడవి శేషు సోలో గా అద్భుతమైన విజయాన్ని అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఆ తర్వాత గూఢచారి మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత ఎవరూ మూవీ తో మరో విజయాన్ని అడవి శేషు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం మేజర్ మూవీ తో అడవి శేషు ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా అడవి శేషు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఈ యువ హీరో హిట్ ది సెకండ్ కేస్ అని మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ డిసెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతోంది. మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్ గా నటించగా , శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. తాజాగా అడవి శేషు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... క్షణం మూవీ ఇప్పటివరకు నా కెరియర్ లో ఉత్తమ చిత్రం. మేజర్ మూవీ నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన సినిమా. హిట్ ది సెకండ్ కేస్ మూవీ నా కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. మరి అడవి శేషు "హిట్ ది సెకండ్ కేస్" మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: