అక్కినేని అఖిల్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ మూవీ ఏజెంట్.. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల పైన భారీగా అంచనాలను పెంచేస్తున్నది. ఈ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి ఇప్పటికి రెండు సంవత్సరాలు పైనే కావస్తోంది. కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్ , టీజర్స్ ఈ సినిమా అంచనాలను పెంచేస్తూ ఉన్నాయి.ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే ప్రమోషన్స్ని కూడా ప్రారంభించాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను త్వరలోనే నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈవెంట్ కు rrr సినీ హీరోలు రామ్ చరణ్ ,ఎన్టీఆర్ కలిసి గెస్ట్లుగా పిలవాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ఇద్దరు హీరోలు గనుక అఖిల్ ఏజెంట్ సినిమా కోసం వచ్చారు అంటే అభిమానులు అదిరిపోయే ట్రీట్ ఖాయమని సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.ఒకే వేదికపై మెగా నందమూరి అక్కినేని హీరోలను చూసి అవకాశం ఉంటుంది అంటూ అభిమానులు తెలుపుతున్నారు. మరి నిజంగానే rrr సినిమా హీరోలు వస్తారా అనేది ఇప్పుడు చర్చనీ అంశంగా మారుతోంది.ఇందులో హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తూ ఉన్నది.అలాగే మమ్ముట్టి కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ పైన కూడా రూమర్లు వినిపిస్తూ ఉన్నాయి కానీ ఏది ఏమైనా ఏప్రిల్ 28వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీగా ఉన్నట్లు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏజెంట్ సినిమా పైన ఎలాంటి విషయాన్నైనా సరే మేమే క్లారిటీ ఇస్తామని చిత్ర బృందం తెలుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: