
ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా తన కేరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె తన స్నేహితుడు గౌతమ్ ను వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి ఆమె అడుగు పెట్టారు. ఇలా పెళ్లయిన కొద్ది నెలలకే ఈమె ప్రెగ్నెంట్ కావడం అలాగే బిడ్డకు జన్మనిచ్చి బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూ కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని తెలుస్తుంది.
ఇలా తన కుమారుడు ప్రస్తుతం కాస్త పెద్ద అవ్వడంతో తిరిగి ఈమె కెమెరా ముందుకు రావడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే గతంలో తాను కమిట్ అయినటువంటి ఇండియన్ 2 సినిమాలో ఆమె బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఈమె నందమూరి నటసింహం బాలకృష్ణ,అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది.ఇక ఈ విషయాన్ని చిత్ర బృందం కూడా అధికారకంగా తెలియజేశారు. ప్రస్తుతం ఈమె ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు చిత్ర బృందం వెల్లడించారటా.. అనిల్ రావిపుడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నటువంటి ఈ సినిమాలో మరొక యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. ఇకపోతే కాజల్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.ఇందులో ఈమె 40 నిమిషాల పాటు ఆమె సందడి చేయనున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా కోసం కాజల్ తీసుకుంటున్నటువంటి పారితోషకం కూడా ప్రస్తుత ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..బాలయ్య సినిమా కోసం ఈమె ఏకంగా నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలియడంతో అందరూ కూడా షాక్ అవుతున్నారు.ఇలా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అంటే పెళ్లి అయినా కూడా కాజల్ క్రేజ్ ఏ మాత్రం కూడా తగ్గలేదని అభిమానులు అనుకుంటున్నారు.