ప్రముఖ సీనియర్ నటి లేడీ కమెడియన్ లక్ష్మీ మేనకోడలిగా ప్రముఖ నటుడు రాజేష్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఎక్కువగా తమిళంలోనే అవకాశాలు రావడంతో తమిళంలో హీరోయిన్గా భారీ పాపులారిటీని అందుకుంది ఐశ్వర్య .గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ డి గ్లామర్ పాత్రలతోనే ప్రేక్షకులకు దగ్గరవుతు తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని దక్కించుకుంది. అయితే ఇటీవల తనకు తెలుగులో అవకాశాలు ఎందుకు రావడం లేదో చెబుతూ తెలుగు సినీ ఇండస్ట్రీపై కొన్ని సంచలన కామెంట్లను చేసింది ఈ యంగ్ బ్యూటీ. 

అయితే వాస్తవానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే వారు చెప్పిన పని కచ్చితంగా చేయాలని.. మొత్తం విప్పి చూపిస్తే తప్ప అవకాశాలు రావని గతంలో కొంతమంది హీరోయిన్లు డైరెక్ట్ గానే చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే .అంతేకాదు మరికొందరు హీరోయిన్లు అవకాశాల పేరుతో మమ్మల్ని నలిపేస్తున్నారు అన్న నిజాలను కూడా బయటపెట్టారు. ఐశ్వర్య రాజేష్ కూడా తెలుగు సినీ ఇండస్ట్రీపై కొన్ని సంచలమైన కామెంట్లను చేసింది .ఇందులో భాగంగానే మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయికి తెలుగులో అవకాశాలు ఇవ్వరు.. దీనిపై గతంలో చాలామంది తెలుగు హీరోయిన్స్ మాట్లాడారు.

నేను కూడా తెలుగు అమ్మాయినే కదా.. నాకు కూడా అవకాశాలు రావాలి కదా ..కానీ తెలుగులో మాత్రం నాకు అసలు అవకాశాలు ఇవ్వరు ..ఇక్కడ నటించాలంటే కచ్చితంగా సన్నగా ఉండాలి.. గ్లామర్ షోలు చేయాలి.. తెల్లగా ఉంటేనే ఇక్కడ అవకాశాలు ఇస్తారు.. ఇలాంటివి తనకు సెట్ అవ్వవు అని.. తెలిసి తెలుగులో అవకాశాల కోసం వెతకడం మానేశానంటూ తెలియజేసింది ఐశ్వర్య రాజేష్. అంతేకాదు తనకు అక్కడే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని.. అక్కడే సక్సెస్ అయ్యానని చెప్పుకొచ్చింది ఈ యంగ్ హీరోయిన్ అయితే ఇటీవల ఆమె ఫర్హానా సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో మరింత పాపులారిటీని దక్కించుకుంది ఈమె..!!

మరింత సమాచారం తెలుసుకోండి: