
మనుషుల్లో రోజురోజుకు మానవత్వం కరువైపోతుంది. ఇప్పటికే రోజురోజుకు హత్య ఉదంతాలు పెరిగిపోతున్నాయి. కనీస మానవత్వం మరుస్తున్న మనుషులు.... సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి ఆలోచించడం లేదు. జాలి దయ అనేది లేకుండా ఇతరుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చూసాం . తాజాగా ప్రియుడి మత్తులో కళ్ళు మూసుకుపోయిన ఒక కూతురు తన కన్నతల్లి ప్రియుడితో కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కీర్తి రెడ్డి హత్య ఉదంతం రాష్ట్రంలో కలకలం రేపింది. నవ మసాలు మోసి కని పెంచిన తల్లి అని కూడా మరచినా కూతురు కర్కశంగా తల్లిని హత్య చేయడం రాష్ట్రం మొత్తం కలకలం రేపింది.
ఇక ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నవ మాసాలు మోసి ఎంతో జాగ్రత్తగా కనిపెంచుతున్న తల్లి కొడుకునే కడతెర్చింది . అభం శుభం తెలియని తన కన్న కొడుకును ఆ తల్లి కాటికి పంపించండి. తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని కర్కశంగా హత్యచేసి ఉసురు పోసుకున్నది . కన్నపేగు తీపి మరచిన ఆ తల్లి కర్కశంగా మారిపోయింది. ఇంకా అభం శుభం తెలియని ఆ కొడుకును అతిదారుణంగా ఉరివేసి చంపేసింది . ఆ బాలుడు ఆ కన్నతల్లి ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉండగా కన్నతల్లి కడుపుతీపి మర్చి కన్నకొడుకును హత్య చేసినది . అమ్మ నన్ను ఎందుకు చంపుతున్నావ్... నేనేం తప్పు చేశానమ్మ... అంటూ మనసు నిండా బాధతో ఆ బాలుడు అడుగుతున్న కూడా ఆ తల్లి మనసు కరగలేదు. అతి దారుణంగా కన్న కొడుకుని ఉరి కొయ్యకు వేలాడదీసింది కర్కశ తల్లి.
నిజాంబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కన్న కొడుకునే హత్య చేసింది ఆ కసాయి తల్లి. శుభం తెలియని ఆ బాలుని ఉరికొయ్యకు వేలాడదీసి హత్య చేసింది. ఇంకా పూర్తిగా లోకానికి కూడా అర్థం చేసుకుని ఆ బాలుడు తనకు జన్మనిచ్చిన తల్లి చేతిలోనే మరణించాడు. తన కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకొని ప్రేమను పంచి పెంచి ప్రయోజకున్ని చేయాల్సిన ఆ తల్లి కడుపు తీపి లేని మనిషిగా మారి కన్న కొడుకు ప్రాణాలను గాల్లో కలిపేసింది. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది. తన కొడుకుని ఉరికొయ్యకు వేలాడదీయడం తో తాను ఏం తప్పు చేశానని తన కన్నతల్లి తన ప్రాణాలను తీస్తుంది అనే బాధతో విలవిలలాడుతూ ప్రాణాలను వదిలాడు ఆ బాలుడు . ప్రస్తుతం ఈ దారుణ ఘటనతో అందరినీ కలిసి వేస్తోంది.