
దీంతో కాన్షిరామ్ చేపట్టిన దళిత, బహుజన ఉద్యమయంతో బీఎస్‌పీ గుణాత్మకంగా రాజకీయాల్లో మార్పులు చేసింది. తరువాత కాంగ్రెస్ లాగా మాయవతి కూడా పాలిటిక్స్‌లో బ్రాహ్మణులకు భాగం ఇచ్చి అధికారం పొందింది. ఈ దళిత రాజకీయాలతో బీజేపీ సీన్‌లోకి ఎంటరయింది. దళిత, ఓబీసీ రాజకీయాలు బీజేపీకి పెద్ద చాలేంజ్ గా మారింది. ఎందుకంటే హిందుత్వం లేదా మెజారిటీ అంశంపై బీజేపీ ఫోకస్‌గా ఉండేది. తరువాత ముస్లిం మొబిలేషన్ ఇతర కారణలతో బీజేపీ దళితులకు దగ్గరయింది. అధికారంలోకి వచ్చింది. మాయవతి తన సామాజిక వర్గానికి దూరమవుకుంటూ వచ్చింది. ముఖ్యంగా ఎంబీసీ ఓట్లు పొందడంలో బీజేపీ సఫలికృతమయింది.
రాబోయే 2022 యూపీ అసెంబ్లి ఎన్నికల్లో ఈ అంశం ఎంత మేరకు పని చేస్తుందో చూడాలి. బీజేపీ పొలిటికల్ ప్రాజెక్ట్‌లో యూపీ ప్రయోగశాల వంటింది. రామ్‌జన్మ భూమి, అయోధ్య మందిర్, హిందూత్వ ఎజెండా, యాంటి ముస్లిం స్ట్రాటజీ వంటి అంశాలు అణచివేతకు గురైన సామాజిక వర్గాలను కూడా తమ వైపునకు తిప్పుకోవడంలో విజయం సాదించింది బీజేపీ. అలాగే దళిత, బహుజన్ వర్గాల్లో ఉన్న లోపాలను కూడా బీజేపీ అనుకూలంగా మలుచుకుంది. దీని వల్లనే 52 శాతం ఉన్న ఓబీసీ అధికారం చేపట్టలేకపోతోంది.
సామాజిక వర్గాల్లోని భిన్నాలను తమకు సానుకూలంగా మలుచుకోవడంలో నాయకులు ముందుంటున్నారు. ఇందువల్లనే మాయవతి వర్గం చమరేతర దళితులను తమ వైపు తిప్పుకోవడంలో యూపీ బీజేపీ సఫలికృతం అయింది. అలాగే ఆర్ఎస్ఎస్ కూడా దళిత బస్తీలు, ప్రాంతాల్లో సేవలు చేయడం కూడా బీజేపీకి పెట్టుబడిగా మారిందని చెప్పవచ్చు. మొన్నటికి మొన్న భూ కబ్జా మాఫియా నంచి స్వాధినం చేసుకున్న భూముల్లో దళితులుకు, పేదవాళ్లు ఇళ్లు కట్టిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు కూడా.